అబద్దం అతకలేదు! కమ్మ కులం టార్గెట్‌గా ఇతరులతో వీడియోలు

June 02, 2020

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిని మొదట టిక్‌టాక్ చేశారు. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా ఓ కులాన్ని కించపరిచేలా ఉంది. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు సూచిస్తున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించారు. ఈ వ్యాధి వేలాదిమందిని బలిగొంది. ప్రపంచమంతా గజగజ వణికిపోతోంది.

ఇలాంటి సీరియస్ సమయంలో కరోనాను తేలిగ్గా తీసుకోవడంతో పాటు కమ్మ కులాన్ని దారుణంగా కించపరిచేలా ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో మనం కమ్మవాళ్లం.. మనకు కరోనా రాదు.. అని ఉంటుంది. ఈ వీడియోలో ఓ మహిళ, మరో వ్యక్తి కనిపిస్తారు. వాస్తవానికి ఈ వీడియోలో ఉన్నది కమ్మ కులానికి చెందిన వారు కాదు. అందుకే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది అని చెప్పేది. కమ్మ కులానికి చెందని వారితో వీడియోలు చేయించి.. ఆ కులాన్ని అవమానించేలా చేయడం చాలాకాలంగా సాగుతోందని అంటున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ ఇమేజ్‌ను తెలుగు యువత ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'క్రిస్టియన్ మహిళతో కమ్మవారిని అసహ్యించుకునేలా వీడియోలు చేసి.. వైరల్ చేస్తున్నాడు జగన్. దయచేసి ప్రజలకు తెలియజేయండి' అని విజ్ఞప్తి చేశారు. అందులో ఉన్నది కమ్మవారు కాదని, క్రైస్తవులనే నిర్ధారణగా.. వారి వీడియోలో ఉన్న జీసస్ బొమ్మతో కూడిన వారి ఫోటోను పోస్ట్ చేశారు. అంతేకాదు, తన రెడ్డి సామాజిక వర్గానికి పదవులన్నీ ఇచ్చాడని, ఈ నిజం ప్రజలకు తెలియడంతో దానిని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా కుల వ్యతిరేక వీడియోలు చేసి కమ్మకులం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ వీడియోను ఎవరు చేయించారనే అంశాన్ని పక్కన పెడితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీని, టీడీపీకి మద్దతుగా ఉన్న కమ్మ, బీసీ వర్గాలను టార్గెట్ చేసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కమ్మవారిని అణిచివేసేందుకు అమరావతిని రాజధానిగా తీసేయడం మొదలు నిన్నగాక మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కులముద్ర వేయడం వరకు.. అన్ని కూడా ఓ కులం టార్గెట్‌గా వెళ్తున్నాయనే వాదనలైతే వినిపిస్తున్నాయి. చివరకు కరోనా సమయంలో దాని మీద దృష్టి పెట్టి ప్రజలను కాపాడటం కంటే కూడా కమ్మకులంపై ఆడిపోసుకోవడంపైనే జగన్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.