జగన్ గృహ‌ప్ర‌వేశం వాయిదాకు చంద్ర‌బాబే కారణమట !!

May 28, 2020

జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశం వాయిదా ప‌డింది. ఎందుకు అని మీడియా అడ‌గ‌కుండానే వారు ఒక కార‌ణం చెప్పారు. వారు చెప్పిన కార‌ణం ఏంటంటే.. అనిల్‌కి, ష‌ర్మిల‌కు ఒంట్లో బాలేద‌ట‌. కోలుకున్నాక మంచి ముహుర్తం చూసి పెడ‌తాం అన్నారు. అయితే వాయిదాకు కార‌ణం ఇది కాదు. వేరేది అని ఇపుడు తెలుస్తోంది.

అయితే, జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశానికి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆ కార్య‌క్ర‌మం క్యాన్సిల్ కావ‌డంతో కేసీఆర్ ఏపీకి రారు అనుకున్నారు. కానీ గురువారం కేసీఆర్ ఏపీకి వ‌స్తున్నారు. అయితే, ఆయ‌న విశాఖ‌లోని స్వ‌రూపానంద‌ ఆశ్ర‌మానికి వెళ్ల‌నున్నారు. ఆయ‌న‌తో పాటు జ‌గ‌న్ కూడా వెళ్తాడ‌ని అంటున్నారు కానీ ఇందులో వాస్త‌వం ఎంతో తెలియ‌డం లేదు. కాక‌పోతే జ‌గ‌న్ చేత కూడా యాగం చేయించాల‌ని కేసీఆర్ ప్ర‌తిపాదించాడు. కాక‌పోతే ఆ యాగం ర‌హస్యంగా జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా… గృహ‌ప్ర‌వేశ వాయిదాకు అస‌లు కార‌ణం కేసీఆర్ గృహ‌ప్ర‌వేశానికి వ‌స్తే జ‌రిగే విప‌రిణామాలు జ‌గ‌న్‌కు ప్ర‌తికూలంగా ఉంటాయ‌ని భావించ‌డంతో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ను విశాఖ‌కు డైవ‌ర్ట్ చేసి ఇంకో ముహుర్తంలో జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశం చేయ‌నున్నారు. ఇది కేసీఆర్‌-జ‌గ‌న్ స‌మాలోచ‌న‌ల అనంత‌రం జ‌రిగిన నిర్ణ‌య‌మే. 

అయితే, ఈ గృహ‌ప్ర‌వేశం వాయిదాకు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్నా అది అశ్వ‌త్థా అతః కుంజ‌ర‌హ అన్న‌ట్టు… మోడీకి విన‌ప‌డ‌కుండా, కేంద్రాన్ని తిట్ట‌కుండా చేయ‌డం వ‌ల్ల జ‌గ‌న్ నిర‌స‌న‌లు పోరాటాలు ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు. కానీ చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా నిర‌స‌న‌ల‌ను ఓ ఉద్య‌మ స్థాయికి తీసుకెళ్లారు. ముందుగా ఏపీలోని ప్ర‌తి జిల్లాలో ధ‌ర్మ‌పోరాట దీక్షలు పెట్టి ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక హోదా కాంక్ష‌ను ర‌గిలించారు. అనంత‌రం ఏకంగా ఢిల్లీలో దీక్ష‌కు దిగారు. దానికి జాతీయ నేత‌లంతా హాజ‌ర‌య్యారు. తెలుగుప్ర‌జ‌ల్లో కూడా అవును ఢిల్లీలో పోరాడితేనే క‌దా మ‌న‌కు వ‌చ్చేది అన్న ఆలోచ‌న మొద‌లైంది. ఢిల్లీకి వెళ్లి ఏపీకి అన్యాయం చేసిన మోడీని నిల‌దీయ‌డంతో ఆ స‌భ స‌క్సెస్ అయ్యింది. పైగా ఆ స‌భ‌కు కేసీఆర్‌-జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేక‌పోయారు. ఇస్తే బాబు అక్కౌంట్లో ప‌డుతుంద‌ని వాళ్లు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. ఇపుడు రాష్ట్రంలో ఆ దీక్ష పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ మొన్న‌నే జ‌గ‌న్‌తో క‌లిసిన‌పుడు ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తాను అన్నారు. కానీ స‌భ జ‌రిగి దేశ‌మంతా మ‌ద్ద‌తు ఇస్తే కేసీఆర్ ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల్లో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టికైనా కేసీఆర్‌ మ‌న‌కు డేంజ‌రే అని ఏపీ ప్ర‌జ‌లు ఫిక్స‌య్యారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ క‌నుక జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశానికి వ‌స్తే అది జ‌గ‌న్‌కి తీవ్ర స్థాయిలో న‌ష్టం చేస్తుంది. అందువ‌ల్లే వాయిదా వేస్తే… త‌ర్వాత కేసీఆర్‌ని పిల‌వ‌కుండా సింపుల్‌గా సైలెంటుగా ముగిద్దాం అన్న ఆలోచ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ జ‌గ‌న్ ఓ అండ‌ర్‌స్టాండింగ్ ప్ర‌కార‌మే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచీ ఆంధ్రప్రదేశ్‌కి మకాం మార్చాక, ఇతర పార్టీల నేతలు కూడా అమరావతికి తరలివెళ్లారు. అక్కడ తమ ఇళ్లతోపాటూ… తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో పార్టీ కార్యాలయంతోపాటూ… ఇంటి నిర్మాణం చేపట్టారు. అది పూర్తవడంతో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 14) గృహప్రవేశం జరగాల్సి ఉంది. చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేశారు. దీని వెనక బలమైన రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గురువారం ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో స్వామి స్వరూపానంద ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి వెళ్లబోతున్నారు. కేసీఆర్‌తోపాటూ జగన్‌ని కూడా స్వరూపానంద ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకే జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ కూడా రాబోతున్నారన్న ప్రచారం జరిగింది.

తెలంగాణలో టీఆర్ఎస్ 15 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, ఏపీలో వైసీపీ కూడా 15 గెలుచుకుంటే ఇద్దరూ కలిసి 30 స్థానాల బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని తమ దారికి తెచ్చుకోవచ్చన్నది టీఆర్ఎస్, వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇదంతా జరగాలంటే టీఆర్ఎస్‌తో దోస్తీపై అప్రమత్తంగా ఉండాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న బీసీ గర్జన సభ తర్వాత జగన్ గృహప్రవేశం చేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన భార్య భారతి… విజయవాడలోనే ఉండి ఇంటి పనులు చూసుకుంటున్నారు. కొన్ని అంశాల్లో జ‌గ‌న్ చిన్న చిన్న మార్పులూ చేర్పులూ చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఇంటి వ్యవహారం చుట్టూ రాజకీయాలు జరగకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.