అమిత్ షాకు కోపం తెప్పించే మాటన్న జగన్

August 06, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెడితే ఏ తప్పు చేయకుండా ప్రెస్ మీట్ ముగించరు. ఆయన తెలుగింగ్లిష్, ఆయన లెక్కల పరిజ్జానం, చట్టంపై ఉన్న అపారమైన అవగాహన... ఈ మధ్య నవ్వులు కూడా పూయిస్తున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ముస్లింల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేలా జగన్ వ్యవహరించారు. 

ఇంతకీ జగన్ ఏమన్నారంటే... మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు. కరోనా కాటుకు కులమత బేధాలు ఉండవు. ఢిల్లీలో జరిగిన ఓ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి కొన్ని దేశాల నుంచి ఆధ్మాత్మిక వేత్తలు హాజరయ్యారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా దానికి హాజరయ్యారు. దేశంలో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమం అయినా జరగొచ్చు.  ఎవరైనా పాల్గొనొచ్చు‘‘ అని జగన్ వ్యాఖ్యానించారు. 

అయితే జగన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్సయ్యారు. సమావేశం, ఆధ్యాత్మికం ఓకే గాని... ఈ సమావేశంలో అనేక చట్ట ఉల్లంఘనలు చేసి మీటింగ్ పెట్టారు అనే విషయాన్ని కేంద్రం గుర్తించి సమావేశం నిర్వహించిన వ్యక్తిపై తీవ్రమైన నేరారోపణలతో కేసు నమోదు చేసింది. ఇపుడు ఆయన పరారీలో ఉన్నారు. వారు ఏ మాత్రం అంతర్జాతీయంగా ప్రకటించిన జాగ్రత్తలు తీసుకోలేదు. మనదేశంలో ఆ మీటింగ్ కు ముందే చెప్పిన సూచనలు పాటించలేదు. ఇంకో అతిముఖ్యమైన విషయం ఏంటంటే... అది దేశ ద్రోహం అంతటి తీవ్రమైన వియయంగా కేంద్రం పరిగణిస్తోంది. దీనికి కారణం... టూరిస్టు వీసా మీద వచ్చారని తెలిసినా కూడా 1000 మంది విదేశీయులను మర్కజ్ లో దాచిపెట్టగా... వారిని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అక్కడి నుంచి కేంద్రం తరలించాల్సి వస్తోంది. జగన్ పేర్కొంటున్న విదేశీ ఆధ్యాత్మిక వేత్తలను ప్రస్తుతం కేంద్రం క్రిమినల్స్ అని పేర్కొంటూ వారి వీసాలను రద్దు చేసింది. వారిపై క్రిమినల్ కేసులు పెట్టింది. వారు దేశం దాటి వెళ్లకుండా చూసి అందరినీ పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు. మరి భారతీయ చట్టాలను ఉల్లంఘించిన క్రిమినల్స్ ను జగన్ ఆధ్మాత్మిక వేత్తలుగా కీర్తించడం అంటే అమిత్ షాకు కోపం తెప్పించడమే మినహా మరేం కాదు. 

తబ్లిగిలో పాల్గొన్న ముస్లింల వల్ల దేశ వ్యాప్తంగా ప్రమాదకరమైన స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాలకు హాజరైన వారి పట్ల సీరియస్గా ఉన్నాయి. ప్రభుత్వం పిలుపునిచ్చినా కొందరు టెస్టులు చేయించుకోకపోగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి వెళ్లిన మెడికల్ సిబ్బందిపై దాడికి దిగడం గమనించాల్సిన విషయం. మరి ఇవన్నీ మరిచిపోయి దొరికిందే సందని జగన్ ఓట్ల వేటలో పడితే కేంద్ర హోం శాఖ చూస్తూ ఊరికే ఉంటుందా? ఏం జరగబోతోందో చూడాలి.