విజయమ్మకు నచ్చినా... జగన్ కి నచ్చలేదట

August 08, 2020

ఏపీలో రకరకాల వింతలు జరుగుతున్నాయి.రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది అన్నట్టు ముఖ్యమంత్రికి నచ్చిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. పనితీరు, నీతి, నిజాయితీ పారామీటర్లు అనేవి కాకుండా వినయ విధేయతలు, అంతకుమించి తప్పొప్పులతో సంబంధం లేకుండా చెప్పింది నో అనకుండా చేసేవారికి అందలం అందుతోంది. అలాంటి ఓ ఘటన తాజాగా బయటకు వచ్చింది.

పనితీరులో కాస్త మంచి పేరు తెచ్చకున్నారు ఇటీవలే  ఏపీ ఆర్టీసీ ఎండీగా వ్యవహరించి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్. 26 సంవత్సరాల తన కెరీర్ లో  ఆయనకు ఇప్పటికీ సొంత ఫ్లాట్ కూడా లేదంటే ఆశ్చర్యమే. నేటి రోజుల్లో ఇలాంటివి నమ్మలేం. 

నిక్సారైన అధికారిగా ఆయనకు పేరుంది. వైఎస్ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆయనకు జగన్ షాకిచ్చారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను బదిలీ చేసి ఏపీఎస్పీ బెటాలియన్ ఏడీజీగా బదిలీ చేశారు. మునుపటి పోస్టుతో పోలిస్తే దీని ప్రాధాన్యం తక్కువ. ఎందుకిలా జరిగిందో అర్థం కాక మాదిరెడ్డి ప్రతాప్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కాస్త గట్టిగా హర్టయ్యారు కూడా. అయితే... ప్రభుత్వ పెద్దలపై అసంతృప్తి మాత్రం బయటకు ఏమీ వ్యక్తంచేయలేదు.

తాజాగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆనాడు వైఎస్ తో పాటు రచ్చబండకు హెలికాప్టరులో తాను కూడా వెళ్లాల్సి ఉందట. ముందు రోజు రాత్రి సీఎంవో కార్యదర్శి సుబ్రమణ్యం ముందు తనను వెళ్లమని చెప్పారట. ఆ తర్వాత మనసు మార్చుకుని తాను వెళ్తానని చెప్పారట. ప్రమాదంలో వైఎస్ తో పాటు వెళ్లిన సుబ్రమణ్యం మరణించారు. ఆ ఘటన తనకు పునర్జన్మగా మాదిరెడ్డి చెప్పారు.

ఆర్టీసీ ఎండీగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రతాప్ ఆర్టీసీ బస్సుల్ని సంజీవినిగా మార్చడం అందరికీ నచ్చింది. దీనిని జగన్ తల్లి విజయమ్మ సైతం అభినందించారట. వైఎస్ జయంతి సందర్బంగా విజయమ్మ తనకు కేకు కూడ పంపారట. ఆ కేకు తిని పడుకున్నారట. నిద్రలో ఉండగానే తన బదిలీ జరిగిపోయిందట. కారణం తనకు తెలియదు అన్నారు. కెరీర్ లో ఎన్నో ఉన్నత పదవుల్ని చేపట్టాను. ముఖ్యమంత్రి ఎందుకు బదిలీ చేసినా ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలంటూ వ్యాఖ్ాయనించారు. తనను హర్ట్ చేసిన సున్నితంగా మాట్లాడుతున్న మాదిరెడ్డి ప్రతాప్ ను జగన్ ఎంత హర్ట్ చేశారో.