జగన్ దెబ్బ... వైజాగ్ కు బ్యాడ్ న్యూస్

June 05, 2020
CTYPE html>
ఒక నగరం రాజధాని అవుతుంది అంటే... అది బూమ్ అంటూ అన్నీ పెరిగిపోవాలి, సదుపాయాలు, రవాణా, రియల్ ఎస్టేట్ పర్యాటకం ఇలా అన్నీ రాకెట్ లా పెరుగుతాయి. కానీ జగన్ విశాఖను రాజధాని చేయగలడు అని జనం నమ్మలేకపోతున్నారు. ఆ కారణంగా విశాఖలో రాజధాని బూమ్ ఏమీ కనిపించడం లేదు. జగన్ చేసే ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు. ఈ ప్రాసెస్ ఎక్కడో ఒకచోట ఆగిపోవచ్చు అన్న అనుమానాలు వైజాగ్ ప్రజల్లోనే కాదు, అందరికీ ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలు గాని రియల్ ఎస్టేట్ వారు గాని ఎగబడటం లేదు. రాని దానికోసం ప్రయత్నం చేయడం కంటే ఆ హైదరాబాదులో ఏదైనా చేసుకుందాం అన్న ఆలోచనతోనే ఉన్నారు. అందుకే వైజాగ్ జోలికి పోవడానికి భయపడుతున్నారు.
ఇప్పటికే అమరావతిలో రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు పెట్టుబడులు పెట్టి బ్లాకైపోయారు. అక్కడమ్మి డబ్బులు చేసుకుంటే గాని ఇంకో చోట పెట్టలేని పరిస్థితి. కానీ అమ్మే పరిస్థితి కూడా లేదు. ఇకపోతే అసలే పర్యాటక కేంద్రమైన విశాఖ... రాజధాని ప్రకటన తర్వాత మరింత పుంజుకోవాలి. అది కూడా జరగలేదు. పైగా వైజాగ్ కు ప్రయాణాలు జనం భారీగా తగ్గించుకోవడంతో ఫ్లైట్లు ఖాళీగా ఉంటున్నాయి. పెట్టుబడిదారులు ఇటువైపు చూడటం లేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినపటి నుంచి వైజాగ్ నగరానికి కొత్తగా ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. ఉన్న పెట్టుబడులు కొన్ని వాటంతటవే వెళ్లిపోగా వరల్డ్ ఫేమస్ కంపెనీలను జగనే స్వయంగా తిప్పి పంపేశారు. కేవలం ఒక భవనం కోసం ఐదారు సాఫ్ట్ వేరు కంపెనీలను వైజాగ్ ను ఖాళీ చేయమని చెప్పడంతో ఇక్కడుండాల్సిన కర్మమాకేంటి అంటూ వారు చెన్నై, హైదరాబాదుకు మూట ముల్లె సర్దేశారు. ఇక ఇంతమంది వెళ్లిపోతుంటే... వైజాగ్ కు ప్రయాణాలు కూడా తగ్గిపోతాయి కదా. ఆ క్రమంలో విమానయాన రంగంలో ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నష్టాలతో నడపడం ఎందుకని విమానాలు రద్దు చేసుకుంటున్నారు. తాజాగా స్పైస్ జెట్ ఢిల్లీ - వైజాగ్ ఫ్లైటును రద్దు చేసింది. దీంతో పాటు ఇండిగో, ఎయిర్ ఏషియా కంపెనీలు కూడా వైజాగ్ నుంచి తమ సర్వీసులను ఉపసంహరించుకునే పనిలో పడ్డాయి. 
జగన్ చర్యల వల్ల ప్రతి రంగంపై ప్రభావడం పడింది. పారిశ్రామిక వేత్తలు నమ్మకం కోల్పోయారు. పెట్టుబడులు రావడం అనేది జరగని పనిగా అయిపోయింది. దీంతో అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిని ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆదాయం లేక అన్ని ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారు జగన్ రెడ్డి. రానురాను ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు లేక రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి.