బెస్ట్ సీఎం నవీన్ పట్నాయక్... మరి జగన్?

August 10, 2020

ఎన్నికల ఫలితాల సర్వేల్లో పాపులర్ అయిన సీ ఓటర్ సంస్థ తాజాగా పాపులారిటీ సర్వే నిర్వహించింది. ప్రధాని గురించి, ముఖ్యమంత్రు గురించి చేసిన ఈ సర్వేలో ప్రజల్లో ఆయా నాయకుల పాపులారిటీపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. ఈ సర్వే ప్రకారం మోడీని 58 శాతం మంది నిర్ద్వందంగా అంగీకరించారు. ఓవరాల్ గా 65 శాతం మద్దతు ప్రధానికి ఉందని తేలిపోయింది. ఒడిసా, హిమాచల్, చత్తీస్ఘర్, ఆంధ్రప్రదేశ్, ఝార్కండ్, కర్ణాటక, గుజరాత్, అస్సాం, తెలంగాణ, మహారాష్ట్రలు మోడీ పనితీరును బాగా మెచ్చుకుంటున్నాయట. 

ఈ లిస్లులో ఆంధ్రా, తెలంగాణ ఉండటమే ఆశ్చర్యం. తెలంగాణలో మోడీకి ఊహించినంత సీన్ లేదు. ఆంధ్రాను అన్నిరకాలుగా మోడీ వదిలేశాడు. ఈ నేపథ్యంలో మోడీతో ఏపీ ప్రజలు 83 శాతం శాటిస్ఫైగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందంటే... ఈ సర్వేలో ఎంత డొల్లతనం ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

 

ఇక మోడీతో సంతృప్తి చెందని రాష్ట్రాల జాబితాలో గోవా మొదటి స్థానంలో ఉండటం విశేషం. పైగా అక్కడున్నది బీజేపీ సర్కారు. ఇక హర్యానా, కేరళ, తమిళనాడు, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, యుపి, కేంద్రపాలితప్రాంతాలు, పశ్చిమ బంగ రాష్ట్రాల్లో మోడీపై తీవ్ర అసంతృప్తి ఉందట. 

 

ఇక రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయానికి వస్తే దేశంలో నవీన్ పట్నాయక్ మోస్ట్ పాపులర్ సీఎంగా నిలిచారు. రెండో స్తానల్ భూపేష్ (చత్తీస్ ఘర్), మూడో స్థానంలో పినరయి విజయన్ (కేరళ) నిలవగా జగన్ నాలుగో స్తానంలో ఉన్నారు. ఉద్దవ్ 5వ స్థానంలో, కేజ్రీవాల్ 6వ స్థానంలో ఉన్నారు.

 

ఈ లిస్టు కూడా అంతే... కేజ్రీవాల్ కంటే జగన్ పాపులర్ సీఎం ఎట్టా అవుతారు? దీన్ని బట్టి ఈ సర్వే శాంక్టిటీ ఉద్దేశాలు ఎవరికైనా ఇట్టే అర్థమవుతాయి. ఈ సర్వే లెక్కలు తప్పు అని చెప్పడానికి ఇంకో ఆధారం ఏంటంటే... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా అనేక క్రియేటివ్ పనులు చేయడంలో కాని పథకాల విషయంలో గాని ఆదరణలో గాని మంచి పేరు తెచ్చుకుంటున్న కేసీఆర్ లీస్ట్ పాపులర్ లిస్టులో ఉండటం. 

ఈ జాబితాలు లెక్కలు చూశాక...  ఈ సర్వే ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేయించి ఉంటారు, దీని వెనుక ఎవరు ఉంటారు అని సులువుగా పసిగట్టవచ్చు.