తండ్రికి మించిన తనయుడు... అపుడే దానిపై కన్ను

July 04, 2020

ప్రజలను ఎమోషనల్ చేసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటేయించుకుని... ఇంకా ప్రమాణ స్వీకారానికి ముందే తనలోని అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాలంలో ప్రజలకు ఒకట్రెండు మంచి పథకాలు ప్రవేశపెట్టి జనాల్ని సంతోషంలో ఉంచి ఇంకోవైపు జలయజ్జం పేరిట ఉమ్మడి ఏపీలో ధనయజ్జం చేశారు. దీనిపై అప్పట్లో కేసీఆర్ తో సహా అందరు నేతలు గగ్గోలు పెట్టారు. ఇక భూపందేరాల గురించి అయితే వేరే చెప్పనక్కర్లేదు. అయితే, ఈ పనులన్నీ చేయడానికి వైఎస్ కు ఐదేళ్లు పట్టింది. కానీ ఆనాడు తండ్రి పేరిట అతను సాగించిన క్విడ్ ప్రో కో పెట్టుబడులకు ఆద్యుడైన జగన్ అధికారం ఇంకా చేపట్టకుండానే ధనయజ్జం మొదలుపెట్టేశారు. ఇప్పటికే 60 శాతం పూర్తయిన పోలవరానికి మళ్లీ టెండర్లు పిలుస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రీటెండర్స్ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అంటే... తనకు అనుకూలమైన కాంట్రాక్టరుకు అంచనాలు పెంచి ఇచ్చే అవకాశానికి అపుడే జగన్ రెడ్డి ప్లాన్ చేశాడని... ఇంత ఫాస్టా? అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
తండ్రి వైఎస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లకు మొదలుపెడితే కొడుకు రెండు రోజులకే మొదలుపెట్టాడని విమర్శలు చేస్తున్నారు జనం. అయితే జగన్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. పోల‌వ‌రం ఏపీ ప్ర‌భుత్వం క‌ట్ట‌ద‌ని, కేంద్ర‌మే పూర్తి చేయాల‌ని అన్నారు. అయితే నిర్ణీత స‌మయానికి మాత్రం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఏంటంటే... కేంద్రం చేపట్టిన ఏ జాతీయ ప్రాజెక్టులు అంత త్వరగా పూర్తి చేయదు. 29 రాష్ట్రాల్లో మోడీకి ఒక్క సీటు కూడా ఇవ్వని ఏపీకి అన్ని డబ్బులు మోడీ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇలా ఆలస్యం చేస్తారనే ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని మేము ముందు ప్రాజెక్టు కడతాం... మీరు డబ్బులు ఇస్తూ ఉండండి.... చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా ఉన్న రోజుల్లో నిర్మాణం రాష్ట్రం చేతిలోకి తీసుకున్నారు. ఇపుడు మోడీ దాన్ని తిరిగి కేంద్రం చేతుల్లోకి పెడతాను అంటున్నాడు. పోలవరం కేంద్రం ప్రాజెక్టు అయినా ఉపయోగం ఏపీకే కదా. అందుకే మనకు దానిని పూర్తి చేసుకోవాలనే తాపత్రయం ఉండాలి. ఇది ఆలస్యం అయితే.... కోస్తాంధ్రకే కాదు, రాయలసీమకూ ఇబ్బందే. ప్రతి ఏటా మధ్య ప్రదేశ్ చత్తీస్ ఘర్, ఒడిసా అడవుల్లోని వర్షమంతా చిన్న ఉపనదుల ద్వారా గోదావరిలోకి చేరి సముద్రంలో కలిసిపోతుంది. ఈ పోలవరం ఆ నీటిని సమర్థంగా వాడి ఏపీని సస్యశ్యామలం చేస్తుంది. అందుకే లోటు బడ్జెట్ లో కూడా చంద్రబాబు దీనికి డబ్బులు కేటాయించారు. అందువల్లే ప్రాజెక్టు వేగవంతంగా పూర్తవుతోంది. ఇక మళ్లీ జగన్ దీనిని కేంద్రం చేతుల్లో పెడితే ఇక అంతే సంగతులు. అయినా జగన్ కు కావల్సింది కాంట్రాక్టులే గాని ప్రాజెక్టులు పూర్తి కావడం కాదు కదా అందుకే అది పూర్తయ్యే సమయంతో జగన్ కు ఇబ్బంది ఏముందంటున్నారు తెలుగుదేశం నేతలు.