జగన్ ని ఓ ఆటాడుకున్న బాబు !

August 15, 2020

చాలాకాలం తర్వాత చంద్రబాబు చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించిన వారు గొంత నొక్కడానికి అధికారమనే ఆయుధాన్ని వాడాలని చూస్తున్నారని, ఇది ఫ్యాక్షనిజం కాదు, పరిపాలన అని గుర్తుపెట్టుకోవాలని ప్రతిపక్ష నేత హెచ్చరించారు. అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ తన తాత రాజారెడ్డి దారిని నడుస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఎల్జీపాలిమర్స్ బాధితులతో మాట్లాడుతూ జగన్ చంద్రబాబును దెప్పిపొడిచారు. 1996 లో ఆ కంపెనీకి చంద్రబాబు అనుమతిలిచ్చారు అన్నారు. అయినా, కంపెనీలకు అనుమతిలివ్వడం నేరం ఎపుడైందో జగన్ కే తెలియాలి. ఇది ఎలా ఉందంటే... కారు యాక్సిడెంట్ అయితే డ్రైవరును కాకుండా కారుకు రిజిస్ట్రేషను చేసిన అధికారిని శిక్షించనట్టు ఉంటుంది. 

తన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో భాగంగా చంద్రబాబు జగన్ పై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ-ఆంధ్ర ఇండియా పాకిస్తాన్ అవుతాయని చెప్పిన పెద్దమనిషి లగెత్తుకువెళ్లి టెంకాయ కొట్టి కాళేశ్వరం గేట్లు ఎత్తారని... గుర్తుచేశారు చంద్రబాబు. మరి అధికారంలోకి రాగానే తప్పులన్నీ ఒప్పయిపోయాయా? 

ఎల్జీపాలిమర్స్ పై కేసు పెట్టి బాధితులను ఆదుకోమని తెలుగుదేశం డిమాండ్ చేస్తుంటే వారిని వెనకేసుకు వచ్చి ఇంతవరకు ఏ కేసు పెట్టకుండా నాటకం ఆడుతున్నది జగన్ అని చంద్రబాబు ఆరోపించారు. విషయవాయులతో ప్రజల జీవితాలనే కలుషితం చేసిన కంపెనీనీ జగన్ పల్లెత్తు మాట అనలేదన్నారు. 

మడ అడవులు అడ్డంగా నరికేసి మునిగిపోయే చోట పేదలకు ఇళ్లు ఇస్తాం అంటున్నారు. వివాదాస్పద స్థలాలన్నీ పేదలకు అంట గట్టి వారు ఇళ్లు కట్టుకుంటే రోడ్లు పాలయ్యేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

ఈ తప్పులపై చర్చ జరగకుండా నీటి పంపకాల గొడవలపై జనాల దృష్టిని మళ్లించే కొత్త కుట్రకు జగన్ తెరలేపారని చంద్రబాబు వివరించారు. వైసీపీ నేతలు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని.. కో-వి-.డ్ కూడా తెలుగుదేశం సృష్టించిందే అని ప్రచారం చేయగలిగిన సమర్థులు అని చట్టాల పట్ల వారి తాతలాగే భయం, గౌరవం రెండూ లేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.