స్పెషల్ ఫ్లైట్ లో లక్నోకు జగన్... ఎందుకో తెలుసా?

April 06, 2020
CTYPE html>
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీ సీఎం హోదాలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లారు. తిరిగి రాత్రి 12.45 గంటలకు ఆయన విజయవాడకు రానున్నారు. అయినా కొన్ని గంటల వ్యవధి పర్యటనకు జగన్ వెళ్లడం, అది కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్లారంటే... ఏదో ముఖ్యమైన అధికారిక కార్యక్రమం ఉంటుందనుంటాం కదా. మరి జగన్ వెళ్లిన ఈ పర్యటన అధికారికమా? వ్యక్తిగతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా కేవలం గంటల వ్యవధి పర్యటనకు సీఎం హోదాలో జగన్ చేస్తున్న ఖర్చు లక్షల్లోనే ఉంటుంది కదా. ఆ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.
మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని కొట్టేసింది కదా. ఆ విజయానికి ముఖ్య కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థేనన్నది జగమెరిగిన సత్యమే. ఈ ఐ ప్యాక్ కు చెందిన డైరెక్టర్ లలో ఒకరైన రుషి వివాహం ఆదివారం రాత్రి లక్నోలో జరుగుతుండగా... ఆ పెళ్లి వేడుకకు హాజరై... రుషిక వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకే జగన్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ లక్నో బయలుదేరారట. ఈ పెళ్లికి ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కూడా హాజరవుతున్నారట. 
సరే... తనను ఎన్నికల్లో గెలిపించిన సంస్థకు చెందిన కీలక వ్యక్తి పెళ్లికి జగన్ హాజరు కావాల్సిందే గానీ... మరీ ఇలా సీఎం హోదాలో ఉండి ప్రత్యేక విమానం వేసుకుని మరీ లక్నో వెళ్లాల్సినంత అవసరం ఉందా? అనేది అసలు సిసలు ప్రశ్న. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాను పొదుపు మంత్రాన్ని పఠిస్తానని, సర్కారీ దుబారా ఖర్చు తగ్గిస్తానని చెప్పుకునే జగన్... ఇలా ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తి పెళ్లికి సీఎం హోదాలో స్పెషల్ ఫ్లైటేసుకుని వెళ్లడం ఎంతవరకు సబబన్న ప్రశ్న వినిపిస్తోంది.