జగన్ దృతరాష్ట్రుడు - ఎవరన్నారీ మాట?

August 14, 2020

తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ కు బెయిలు వచ్చింది. 

14 రోజుల రిమాండ్ లో ఉన్న చింతమనేనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆయనతో పాటు మరికొంత మందికి బెయిలు వచ్చింది. 

బెయిలుపై విడుదల అయిన అనంతరం ఆయన ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు.

‘‘జగన్ పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకుంటున్నారు. కక్షలతో ప్రతీకారంతో జగన్ రగిలిపోతున్నారు. 
జగన్ కు, మహాభారతంలోని ధృతరాష్ట్రుడికి ఏమాత్రం తేడా లేదు.
తనను కేవలం కక్ష సాధించడానికే అరెస్టు చేశారు. అదేపనిగా వేధిస్తున్నారు.
నిరసన తెలపడానికి నేను సంఘటన స్థలం వద్దకు వెళ్తే... పోలీసులు వద్దని వారించారు.
నిబంధనలు ఒప్పుకోవు అంటే వెంటనే తాను తిరిగి రాబోతుంటే... పోలీసులు అదే పనిగా అరెస్ట్ చేశారు’’ అని చింతమనేని ఆరోపించారు.

‘‘ఇంతకాలం ఓపిక పట్టాను. ఇకపై ఆగను. నాపై అక్రమ కేసు బనాయించారు.

పోలీసుల తీరుపై, ప్రభుత్వ తీరుపై హైకోర్టులో పోరాడుతాను.

తెలుగుదేశం నేతలను అరెస్టు చేయడం ద్వారా నోరు మూయించొచ్చు అనుకుంటున్నారు.

అందుకే అందరినీ కేసులతో వేధిస్తున్నారు. అచ్చెన్నాయుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు.

ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు వాహనాల్లో తిప్పారు’’ అని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.