ఇంతకాలం ఏం చేశారు జగన్ ? 

May 28, 2020

కొన్ని తప్పులు ఎంత మంచి చేసినా మరిచిపోరు. జగన్ కూల్చిన ప్రజావేదిక విషయం కూడా అలాంటిదే. ఇండియా వంటి దేశంలో యుద్ధ ప్రాతిపదికన మార్పు తీసుకురావాలంటే అది అసాధ్యం. ఒకవేళ అలా చేయాలని ప్రయత్నిస్తే మంచి జరగకపోగా నష్టం జరుగుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మీటింగ్ లోనే ప్రభుత్వ భవనం అయిన ప్రజావేదికను కూల్చారు. అది బాబు కట్టింది కావచ్చు.. కానీ ఆ డబ్బు మాత్రం ప్రజలదే. 9 కోట్లు పెట్టిన భవనం అది. ప్రభుత్వం ఎమోషన్ తో నడవకూడదు. బాధ్యతతో నడవాలి. అధికారం చేతిలో ఉందని... కూల్చేయండి అంటే... ప్రజలు చమటోడ్చి కట్టిన పన్నులు ఏం కావాలి? 9 కోట్లు ఏ గంగలో కలిసిపోవాలి. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందటే... 9 నెలల క్రితం కూల్చిన ప్రజావేదిక స్క్రాప్ ను వేలం వేస్తున్నట్లు ఈరోజు ప్రకటన ఇచ్చారు. 9 నెలలు పాటు వస్తువులు పీకి పక్కన పడేస్తే అవి 80 శాతం పైగా నాశనం అవుతాయి. ఇంత ఆలస్యంగా వేలం వేస్తే కలిగే నష్టం జగన్ గారి ఆస్తుల నుంచి రాబడతారా? వైసీపీ నేతలు ఇస్తారా? 

అసలు ప్రజావేదికను కూల్చింది ఎందుకు? అక్రమ కట్టడాలను ఏరివేయడానికి. మరి ప్రజావేదిక కాకుండా ఎన్ని కూల్చారు? ప్రభుత్వ భవనం నుంచే మొదలుపెడతాం అన్న ముఖ్యమంత్రి... మరి ఎందుకు మిగతా వాటిని కూల్చలేదు. ఎవరికి భయపడ్డారు. ఎవరి ఒత్తిడి వల్ల ఆగిపోయారు. లేకపోతే అక్రమకట్టడాలే లేవని తేల్చారా? లేక ప్రజావేదిక విషయంలో డ్రామా ప్లే చేశారా? ఇవన్నీ ప్రజలకు వస్తున్న అనుమానాలు. వీటికి సమాధానాలు చెప్పాల్సింది ప్రభుత్వమే. కూల్చడానికి ఒక ప్రణాళిక లేదా? పోయిన ప్రభుత్వ డబ్బు తిరిగి తెచ్చే బాధ్యత ఎవరూ తీసుకోరా? ఇంకెందుకు అధికార వ్యవస్థ? 

వాస్తవానికి జగన్ దాని పట్ల వ్యవహరించిన తీరు ఎవరూ హర్షించలేదు. ఈరోజుకీ ఎప్పటికీ అది జగన్ తీసుకున్న అతిచెత్త నిర్ణయాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. వాస్తవానికి జగన్ బాధ్యతాయుత ముఖ్యమంత్రి అయింటే... దానిని ఇలా అర్ధంతరంగా కూల్చేవాడు కదా. తెలివిగా దానికి పెట్టిన ప్రతి రూపాయి తిరిగి రాబట్టే వాడు. ఉదాహరణకు దానికి పెట్టిన 9 కోట్లు వెనక్కు రాబట్టాలి అనుకుంటే... ఏడాదిపాటు రోజుల లెక్కన ప్రైవేటు ఫంక్షన్లకు కార్యక్రమాలకు అద్దెకు ఇస్తే... ఏడాదిలో 9 లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు అద్దె రూపంలో వచ్చేవి. అపుడు గర్వంగా.. ఎస్ నేను ప్రభుత్వ డబ్బు వృథా చేయలేదు. దీనికి పెట్టిన డబ్బు ఖజానాకు వెనక్కు రప్పించి దీనిని కూల్చివేస్తున్నాను అని కనుక చెప్పి ఉంటే... జగన్ ని ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చూసేవాళ్లం. 

ఒక ఆలోచన లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అక్రమ కట్టడాలపై ఒక వ్యూహం అంటూ లేకుండా వ్యవహరించి ప్రజలకు నష్టం కలిగించింది వైసీపీ సర్కారు. పోనీ కూల్చివేసిన వెంటనే వేలం వేసి ఉన్నా కొంచెమైన డబ్బు వచ్చేది. మరీ 9 నెలలు ఆలస్యంగా వేలం వేయడం ద్వారా ఎవరికి నష్టం జరిగింది అనే విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.