జగన్ గెలవాలని కోరిన వ్యక్తిని... ఇపుడు బాధపడుతున్నా, ప్రళయం రాబోతోంది !! 

August 05, 2020

టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో చేరిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వంలో దళితులపై అమానుషమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు.

ఇది కచ్చితంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకమని ప్రత్యక్షంగా తెలుస్తోందని అన్నారు. 

దళిత డాక్టరును వేధించారు, కనీసం రిగ్రెట్ లేదు నడిరోడ్డు మీద గుండు గీశారు. ఆయన ఏం న్యాయం చేసింది ప్రభుత్వం?

మరో దళిత డాక్టరు అనితారాణిని దారుణంగా వేధించారు.

ప్రభుత్వ పెద్దలే అందులో ఇన్వాల్వ్ అయ్యారు.

మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడిని దారుణంగా కొడితే ఆ యువకుడు దెబ్బలతో ఆస్పత్రి పాలై ప్రాణాలు వదిలాడు

దళిత ఆడపిల్లను గ్యాంగ్ రేపి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. 

ఆ అబ్బాయి వరప్రసాద్ వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును ప్రశ్నిస్తే గుండుగీయించారు.

ఈ సంఘటనలో పోలీసులు మీద చర్యలు తీసుకుంటారా? వైసీపీ నేతలను, స్థానిక ఎమ్మెల్యేని వదిలేస్తారా? ఎంత అన్యాయం ఇది అని మోత్కుపల్లి నరసింహులు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇంత జరుగుతున్నా దళితులు మౌనంగా ఉన్నారంటే ప్రళయం రాబోతోందని అర్థం చేసుకోవాలి. జగన్ నుగెలిపించమని తిరిగి కోరాను.

దళితులు అయిన మాలమాదిగలు ముందుండి జగన్ కి ఓట్లేసి గెలిపించారు.

కానీ జగన్ అలాంటి వారిని అణచివేస్తున్నారు. ఓట్లేసే దాకా ఒక ధోరణి, గెలిచాక ఇంకో ధోరణి అవలంభిస్తారా.. వీటన్నింటి మీద విచారం వ్యక్తంచేసి, విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షిస్తేనే బాధితులకు న్యాయం జరిగినట్లు.

లేకపోతే భవిష్యత్తులో జగన్ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని మోత్కుపల్లి నరసింహులు హెచ్చరించారు.