ఒక సీఎం ఇలా చేయడం చరిత్రలో మొదటిసారట

July 03, 2020

5 వేల మంది పోలీసు భద్రత మధ్యలో అసెంబ్లీ సమావేశాలు పెట్టడం 

డమ్మీ కాన్వాయ్ లో ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకోవడం

అవాంఛనీయ సంఘటనలు జరగని చోట మెడికల్ దుకాణాలు, పాలకేంద్రాలు బంద్ చేయించడం

ప్రజలకు తెలియకుండా ముఖ్యమంత్రి ప్రయాణించడానికి రాత్రికి రాత్రి కొత్త రోడ్లు వేయడం

ఈ నాలుగు రికార్డులో భారతదేశ చరిత్రలో ఒక్క జగన్ మీద మాత్రమే ఉన్నాయని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇంత పిరికి ముఖ్యమంత్రిని ఎన్నడూ, ఎక్కడా చూడలేదని... ఈ పిరికితనానికి జగన్ సిగ్గుపడాలన్నారు. పులివెందుల పులి రైతులకు తెలియకుండా దాక్కుని ఆఫీసుకు పోవడం జగన్ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అంటూ దేవినేని ఫైర్ అయ్యారు. అమరావతి రైతుల ఉద్యమం చూసి జగన్ వెన్నులో వణుకు మొదలైందని దేవినేని విమర్శించారు.

అమరావతిలో భూములు కొట్టేయడానికి విశ్వప్రయత్నం చేసి అక్కడ కుదరక విశాఖలో భూములు కొన్నారు. ఇపుడు అవి అమ్ముకోవడానికి వైజాగ్ రాజధానిగా ప్రకటిస్తున్నారు. తమ మంచి కోసం ప్రజలు ఓట్లేసి జగన్ అధికారాన్ని తన మంచి కోసం వాడుతున్నారని ఉమ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ పోలీసులు మాకు నోటీసులు ఇచ్చారు. ఎవరు అడ్డుకున్నా అసెంబ్లీని ముట్టడించి తీరుతాం అని దేవినేని హెచ్చరించారు.