వరల్డ్ బ్యాంక్ లోను - గుట్టు విప్పిన టీడీపీ

December 05, 2019

వరల్డ్ బ్యాంకు లోను తిరస్కరించడం వల్ల పోయిన పరువును కాపాడుకోవడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారని టీడీపీ నేత యనమనల పేర్కొంది. వరల్డ్ బ్యాంకు లోను వెనక్కు పోవడానికి ప్రధాన కారణం జగన్ అని దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మీద నిందలు వేసి... అవి అట్టర్ ఫ్లాప్ కావడంతో అయోమయంలో పడ్డారన్నారు. జగన్ వరల్డ్ బ్యాంకు లోను తిరస్కారానికి ఎలా కారణమయ్యిందీ ఆయన వివరించారు.

స్టెప్ 1
చంద్రబాబు ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుతో చర్చలు జరిపి ప్రాజెక్టును వివరించి లోనుకు అప్లయి చేస్తే దానికి వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది. ఆ లోను వస్తే అమరావతి కట్టేస్తాడని, ఇతక తమ పార్టీ ఉండదని భావించిన జగన్ ఒక కుట్ర పన్నారు. ఈ లోను అడ్డుకునే పనిని జగన్ తమ నేతలకు అప్పగించారు. జగన్ పార్టీ నేతలు కొందరు రైతుల ద్వారా వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాశారు. అందులో అవకతవకలు ఉన్నాయని, మంచి ప్రాజెక్టు కాదని ఫిర్యాదు చేశారు.

స్టెప్ 2
లేఖల వల్ల ప్రపంచ బ్యాంకుకు లేని అనుమానాలు కలిగాయి. దీంతో ప్రాజెక్టుపై విచారణ జరుపుతామని, విచారణ అనంతరం లోను మంజూరు చేస్తామని వరల్డ్ బ్యాంకు పేర్కొంది.

స్టెప్ 3
వరల్డ్ బ్యాంకు ఒక విదేశీ సంస్థ అది మన దేశంలోని ఒక ప్రాజెక్టులో విచారణ జరపడం వల్ల మనకు చెడ్డపేరు వస్తుందని, అందులో ఏమైనా తేడా వస్తే ఇతర ప్రాజెక్టులపై కూడా ఇదే డిమాండ్ ప్రపంచ బ్యాంకు వినిపించే అవకాశం ఉందని అందువల్ల ఆ డబ్బు రాకపోయినా పర్లేదు విచారణ వద్దని కేంద్రం విచారణకు నో చెప్పింది. వరల్డ్ బ్యాంకు కేంద్రం తిరస్కారంతో లోను ఉపసంహరించుకుంది. కానీ కేంద్ర వల్ల జరిగిన నష్టానికి ప్రత్యామ్నాయం ఏమీ కేంద్రం చూపలేదు.

ఇపుడు మీకు అర్థమైందా మొత్తం వ్యవహారం. వైసీపీ ప్రచారం చేస్తున్నది వేరు, వాస్తవం వేరు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ పార్టీ రాజకీయ భవిష్యత్తు కోసం చేసిన ఒక పని ఈరోజు మన రాజధాని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఈ వివరణతో వాస్తవాలు ఏంటో జనాలకు అర్థమైపోయాయి.