పవన్ కి అవకాశాలు పెంచుతున్న జగన్

June 04, 2020

కరోనా లక్షణాలు ఏంటి అని ఇపుడు చదువుకోని వారికి కూడా తెలుసు. అంత ప్రచారం జరిగింది అంతా. అందుకే దీనిపై అందరికీ అవగాహన ఉంది. ఒక ఏపీ ముఖ్యమంత్రికి తప్ప. ప్రపంచాన్ని ఇంకా కబళిస్తూనే ఉన్న కరోనా ఒక రెస్పిరేటరీ సమస్య. అంటే ఊపిరితిత్తుల వ్యవస్థపై ప్రభావం చూపేది. దీని ప్రధాన లక్షణం దగ్గు, జలుబు, తుమ్ములు. ఇవి బలహీన పడటం వల్లే వచ్చే అనుబంధ సమస్య జ్వరం. ప్రపంచమంతటా ఘోషిస్తున్నా... జగన్ ఏమ వినడు, చదవడు, పట్టించుకోడు. ఓట్లు రాల్చే తన పథకాలు గీసుకోవడంలో బిజీ కదా. అందుకే...  నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ అజ్జాన ప్రదర్శనను ప్రపంచమంతా వీక్షించింది. 

కరోనా సాధారణ జ్వరం మాత్రమే అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లు అందరినీ షాక్ కి గురిచేశాయి. అయినా కొరియాలో పుట్టిందని అవలీలగా చెప్పిన ఈ యనకి అది, పారసిటమాల్ మాత్రతో తగ్గిపోయేది అని చెప్పిన ఈ నాయకుడికి... కరోనా కేవలం జ్వరమని చెప్పడం పెద్ద విషయమేమీ కాదు. కానీ... అతను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున అతను చెప్పింది జనం నమ్మితే ఏపీ పరిస్థితి ఇటలీ కంటే ఘోరంగా ఉంటుంది. అందుకే దీనిపై పవన్ సీరియస్ గా స్పందించారు.  

‘‘కరోనా వ్యాధికి సంబంధించి ఒకసారి సైన్స్ న్యూస్ చూడండి’’ అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో జగన్ కు సూచించారు. www.sciencenews.org లింక్‌‌ను షేర్ చేసిన ఈ కేస్ స్టడీని పరిశీలించండి అని సూచించారు.  ‘‘కోవిడ్-19(కరోనా) అందరూ అనుకుంటున్నట్లుగా సాధారణ జ్వరం మాత్రమే కాదన్నారు. చైనాలో కేస్ స్టడీస్ చూడండి. కోవిడ్-19 రోగుల్లో గణనీయంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వెల్లడైంది’’ అని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు.  ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తాయని చెబుతున్న జగన్ బ్యాచ్.... సీఎం చెప్పేది నిజమని జనాలు నమ్మితే కొంపలు మునుగుతాయి అంటున్నారు. అందుకే పవన్ వెంటనే రెస్సాండయ్యారు. 

జగన్ కొంతకాలంగా ఇలాంటి మిస్టేక్స్ విపరీతంగా చేస్తున్నారు. జనాల్లో పవన్ కంటే జగన్ తెలివైన వాడని నమ్మే వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. కానీ కొన్నాళ్లుగా జగన్ ను గమనించాక... ఇతని కంటే పవన్ కళ్యాణ్ ఎన్నో రెట్లు బెటర్ అనిపించేలా వ్యవస్తున్నారు జగన్. జగన్... కి ఏ ముఖ్యమంత్రికి లేనంత మంది సలహాదారులు ఉన్నా వారంతా వంగమాగదులే గాని సలహాదారులు కాదు. సాధారణంగా సలహదారులు ఎక్కడైతే తనకంటే పరిణితి, జ్జానం ఉన్నవారిని పెట్టుకుంటారు. కానీ జగన్... కేవలం సలహాదారుల పోస్టులను తన వాళ్లకు ఉపాధి కల్పించడానికి వాడుతున్నారు. అందుకే  ఈ దుస్థితి. వారికి తెలియదు. తెలిసినా తమ బాస్ కి చెప్పలేరు. చెప్పినా ఈయన వినరు. ఇదంతా చూస్తుంటే.... జగన్ తన తప్పులతో ఇతరులకు అవకాశాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది.