​లీకులు నమ్మి పరువు తీసుకున్న జగన్​ 

May 31, 2020

ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్. అయితే పదో తేదీ నుంచి లాక్ డౌన్ సడలింపు గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ, ప్రాంతీయ మీడియాల్లో మోడీ సడలింపులతో లాక్ డౌన్ కొనసాగిస్తారని చర్చ జరిగింది. అధికారుల్లోను ఇదే ప్రచారం అయ్యింది. ఈ క్రమంలో మోడీ ఏఏ సడలింపులు ఇస్తారని మీడియాలో వచ్చిన వార్తలు చూసుకుని వాటన్నటిని ప్రస్తావిస్తూ జగన్ లేఖ రాశారు. ఒక అడుగు ముందుకు వేసి మన దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లు ఓపెన్ అయ్యేలా విదేశాలతో మాట్లాడాలని కూడా ఒకపెద్ద సలహా పడేశారు జగన్. ఈ మేరకు మోడీకి లేఖ రాశారు. అంటే ఎలాగూ మోడీ చేయాలనుకున్నారు కాబట్టి...  మనం ఒక రోజు ముందు లేఖ రాస్తే క్రెడిట్ మొత్తం తన అక్కౌంట్లో వేసుకోవచ్చని జగన్ ప్లాన్ వేశారు. తన ప్లాన్ కు మురిసిపోయారు. ఇక సాక్షితో టై అప్ లో ఉన్న ఎన్డీటీవీ కేరళ, ఒడిసాను మరిచిపోయి ఏపీ దేశంలో నెం.1 అని అచ్చేసిన అబద్ధాన్ని కూడా జగన్ బ్యాచ్ విపరీతంగా ప్రచారం చేసింది. ఈరోజు నుంచి మా అన్న దేశంలో హీరో అవుతారని పొద్దున్నే మొహాలు కడుక్కుని టీవీ ముందు కూర్చున్నారు జగన్ బ్యాచ్. 

 

కట్ చేస్తే... మిత్రోం... లాక్ డౌన్ మే 3 వరకు ఉంటుంది. ఇపుడు సడలింపులు ఏం లేవు. ఇంకా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం పోతే పోనీ, డబ్బు పోతే పోనీ... ఆర్థిక వ్యవస్థ పోతే పోనీ మనం బతికుంటే ఏదైనా సాధిస్తాం. కేసులను బట్టి 20వ తేదీ తర్వాత సడలింపులు గురించి ఆలోచిద్దాం అని మోడీ అనేసరికి జగన్ పరువు గంగలో కలిసింది. దీంతో జగన్ అభిమానులు నీరుగారి పోయారు. 

 

జగన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే... ఈసారి కేసీఆర్ ను ఫాలో కాకపోవడం. జగన్ కి చంద్రబాబుకి ఉన్న అనుభవం లేదు. కేసీఆర్ కి ఉన్న అవగాహన శక్తి లేదు. ఈ రెండు లేనపుడు సొంత ప్రయోగాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సాధారణంగా కేసీఆర్ ను ఫాలో అయ్యే జగన్ ఈసారి మాత్రం సొంతంగా క్రెడిట్ కొట్టేద్దామని చేసిన ప్రయత్నం తుస్సుమంది. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వ్యాధి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నవాడెవడూ సడలింపులు ఉంటాయని అనుకోరు. అసలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడగింపు గురించి ఏ మీడియా పోల్ పెట్టినా... జనమే స్వయంగా లాక్ డౌన్ పొడగించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా సడలిస్తుందని జగన్ ఆలోచించారో అర్థం కాని పరిస్థితి. 

కాబట్టి ఇక నుంచి అయినా తనకు అచ్చొచ్చినట్టు ఆ కేసీఆర్ ఫాలో అవమని అనుచరులు అయినా సలహా ఇస్తారో చూడాలి.