జగన్... ఎక్కడ విన్నావు, ఎక్కడున్నావు?

July 01, 2020

నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ... ఎన్నికల్లో సినిమా డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఏపీలో ప్రజలకు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలో తరిస్తున్నారని జనం వాపోతున్నారు. అత్యంత ప్రధానమైన నీరు, విత్తనాలు, పింఛన్ల వంటి ప్రజల ప్రత్యక్ష సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. దీంతో పాలన చిందరవందరగా తయారైంది.

ప్రతి నెలా ఒకటో తేదీ రావాల్సిన పింఛన్లు ఈసారి అందలేదు. 

ప్రతి ఏడాది జూన్లో అందాల్సిన విత్తనాలు ఈసారి రైతులకు దొరకలేదు

వర్షం ఎలాగూ ఆలస్యమైంది. కానీ పట్టి సీమ నీళ్లు కూడా అదేపనిగా ఆలస్యం చేశారు.

ఇక రాష్ట్రంలో ప్రతి రోజు సుమారు 300 కుటుంబాలు ప్రమాదాల వల్ల రోడ్డున పడుతుంటాయి.  ప్రభుత్వ భీమా (చంద్రన్న భీమా)తో వారి జీవితానికి భరోసా దక్కేది. దానికి జులై 1న కట్టాల్సిన భీమా సొమ్ము ప్రభుత్వం కట్టలేదు. 

దీనికంతటికీ ప్రధాన కారణం ఒకటే. ప్లానింగ్ లోపం. నిధులు రాక, పోక గురించి అనుభవం లేని వ్యక్తి చేతిలో పాలన ఉండటం వల్ల ఈ బాలారిస్టాలు ఇక్కడితో ఆగవు. ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి అయ్యాక పాలన గురించి అవగాహన పెంచుకోవడంలో జగన్ విఫలం కావడం, అతని ప్రయారిటీలను మాత్రమే జగన్ కు వివరిస్తూ అధికారులు సాధారణ పరిపాలన పక్కనపెట్టడం వంటి కారణాలతో ఏపీలో గందరగోళం ఏర్పడుతోంది. గత 30 రోజుల్లో ఏపీలో పెట్టుబడుల వేట గాని, సంపద సృష్టికి సంబంధించిన ప్లానింగ్ గాని జరగలేదు. దీంతో పాలన గాడి తప్పింది. పెద్ద ఎత్తున జరిగిన బదిలీలు, కొత్తగా వచ్చిన యంత్రాంగం ఎక్కడ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయో తెలుసుకోవడంతోనే సరిపోయింది. కేవలం కక్షపూరిత, స్వార్థ పూరిత బదిలీలు తప్ప... కాలపరిమితి బదిలీలు ఏపీలో జరగలేదు. దీంతో ఎక్కడా ఏ పనులు జరగడం లేదు. ముఖ్యమంత్రికి అనుభవం లేదు, అధికారులకు భయం లేదు అన్నట్టుంది పాలన.