జ‌గ‌న్‌ మ‌రోసారి సీఎం అయితే జ‌రిగేది ఇదే!

July 01, 2020

ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి విప‌క్ష తెలుగు దేశం పార్టీపై క‌క్ష సాధిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. కేవలం చంద్ర‌బాబు, టీడీపీకి ద‌న్నుగా ఉన్న ఒక సామాజిక వ‌ర్గాన్ని జ‌గ‌న్ టార్గెట్ చేశార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. కేవ‌లం చంద్ర‌బాబు మీద అక్కసుతో ప్ర‌జా వేదిక‌ను ధ్వంసం చేసిన జ‌గ‌న్.... ఆ అక్క‌సును కొన‌సాగిస్తున్నారు. ఇక అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు కూడా ఆ క‌క్ష సాధింపులో భాగ‌మేన‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఏపీలో కుల పోరు జ‌రుగుతోంద‌ని, జ‌గ‌న్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌తో ఏపీ ప్రజ‌లు న‌ష్ట పోతున్నార‌ని బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి వంటి నేత‌లు కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కులంపేరుతో జ‌గ‌న్ క‌క్ష సాధింపులు చేప‌ట్టార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది.
వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ ఇళ్ల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్, వైసీపీ నేత‌ల అధికార‌, కుల దుర‌హంకారానికి కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు గ్రామాలు , ఇళ్లు వ‌దిలి వెళ్లిపోవ‌డం క‌ల‌క‌లం రేపింది. జ‌గ‌న్‌తో పాటు ఆ సామాజిక వ‌ర్గ నేత‌ల కుల దుర‌హంకార చ‌ర్య‌లు నానాటికీ పెరిగిపోతున్నాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రంలో కుల వివ‌క్ష ఈవిధంగా ఉంద‌ని, పొర‌పాటున మ‌రోసారి జ‌గ‌న్ కు అధికారం ద‌క్కితే ఏపీలో త‌మ సామాజిక‌వ‌ర్గానికి మాత్ర‌మే పౌర‌స‌త్వం క‌ల్పిస్తారేమోన‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ``కులగజ్జి ముదిరి కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు. వాళ్ళ తుగ్లక్ రెడ్డీ మళ్లీ గెలిస్తే ఆంధ్రలో వాళ్ళే ఉండాలి అందరూ పక్క రాష్ట్రాలకి పోవాలి అంటారేమో``అని ఓ టీడీపీ, బాల‌య్య‌ అభిమాని చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అయితే, టీడీపీకి మ‌ద్ద‌తుప‌లికే ఒక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం వారు ప‌క్క రాష్ట్రాల‌కు వ‌ల‌స పోవాల‌సిందేన‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.