జగన్ టూర్ కోసం ముస్లింల పీర్ల చావిడి తొలగింపు !!

July 05, 2020

జగన్ పద ఘట్టనల పేదల ఇళ్లే కాదు, ప్రార్థన మందిరాలు కూడా బోరుమంటున్నాయి. అనంతపురంలో ఈరోజు జరిగిన ఓ ఘటన... అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఏపీలో ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకం రేపు అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తున్నారు. పథకం మంచిదే. కొందరికి చూపు తెప్పిస్తున్న ఈ పథకం ఇంకా మొదలుకాక మునుపే కొన్ని జీవితాలను నలిపేసింది. అంతేకాదు.. ఒక వర్గం ముస్లింలకు అత్యంత ప్రాముఖ్య స్థలంగా భావించే పీర్ల చావిడిని కేవలం ఒక గంట సభ కోసం తొలగించారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.

ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనిపై ఏ మేరకు సమాచారం ఉందో గాని పీర్ల చావిడి తొలగించవద్దని ముస్లింలు వేడుకున్నారు. అయినా అధికారులు వినకుండా కొన్ని పేదల ఇళ్లను, పీర్ల చావిడిని తొలగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. విపరిణామాలు ఏమీ ఆలోచించకుండా అధికారులు పీర్ల చావిడి తొలగించడంపై వైసీపీ పార్టీలో స్థానికంగా ఆందోళనకు దారితీసింది. ఇది తమకు పెద్ద నెగెటివ్ గా మారుతుందని, స్థానికంగా తిరగలేని పరిస్థితి తెస్తుందని.. స్థానిక నేతలు వాపోతున్నారు. అయినా ప్రార్థనా మందిరాల జోలికి పోవడం ఎందుకు అని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఏమిటీ కంటి వెలుగు...

560 కోట్లతో ఆరు దశల్లో మూడేళ్లలో ఈ పథకాన్ని అమలుచేస్తారు. పరీక్షలు, కళ్లద్దాల అందజేత, కంటి చికిత్సలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తారు.