జగన్ ప్లానింగ్ అదుర్స్.... !!

February 23, 2020

అందరూ చంద్రబాబు నాయుడు తెలివైన వాడు, జగన్ కి అనుభవం లేదు అనుకుంటారు గానీ... జగన్ చంద్రబాబుని మించిన తెలివైన వాడు. అందరికీ ఫలాలు అందేలా పని చేసినా చంద్రబాబు జనంతో విమర్శలు చేయించుకుంటాడు. వైఎస్ కుటుంబం మాత్రం తమ కోసం తాము పనిచేస్తూ కూడా ప్రజాాసేవకులుగా ముద్ర వేయించుకుంటారు. అనుభవం ఉన్న తండ్రి, అనుభవం లేని కొడుకు ఇద్దరూ అంతే సమర్థులు. ఇదొక అరుదైన విద్య. మాటకారి కేసీఆర్ కు కూడా ఇది సాధ్యం కాలేదు. కానీ జగన్ కు మాత్రం బాగా సాధ్యమవుతుంది.

ఒకవైపు పోలవరంలో 700 కోట్లు ఆదా చేశాం అనే పేరుతో జనాలతో మెప్పు... మరోవైపు తన వాళ్లకి ఆ ప్రాజెక్టు, దానికి సబ్సిడరీగా ఆర్టీసీకి సంబంధించిన ఒక కాంట్రాక్టు అదనపు గిఫ్టు. చంద్రబాబు ఉన్నపుడు పరిశ్రమలు వస్తాయి. జగన్ ఉన్నపుడు పరిశ్రమలు వస్తాయి. కాకపోతే చంద్రబాబు ఉన్నపుడు ఎక్కడెక్కిడి నుంచో వచ్చి పరిశ్రమలు పెడితే... జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడి నుంచి వచ్చినా తనకు, తన సంస్థలకు చెందిన వారు మాత్రమే వస్తూ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. 

తాజాగా ఫ్రెంచి ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అరే ఈ ఏంటి ఈ సడెన్ సర్ ప్రైజ్ అనుకుని ఎవరు వీళ్లు అని ఆరా తీశారు. కట్ చేస్తే... వాళ్లు ఫ్రెంచి వాళ్లే కానీ... జగన్ పాత పార్టనర్లు. జగన్ కు చెందిన భారతి సిమెంట్ కొన్నేళ్ల క్రితం ఫ్రాన్స్ కంపెనీ కొన్న విషయం గుర్తుందా... ఎస్ ఇపుడు వచ్చిన వాళ్లు ఆ కంపెనీ సంబంధీకులేనట. ఇదేమీ రహస్యం కాదు. బహిరంగంగా గూగుల్ లో వెతికినా దొరుకుతుంది. ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి బుర్రే బుర్ర. అంతలేనిది... ఇంత పిన్న వయసులో ఏ ముఖ్యమంత్రి కొడుక్కీ సాధ్యం కానంత సంపద ఎలా సంపాదిస్తారు చెప్పండి. అనవసరంగా అతనికి అనుభవం లేదు అని ఆడిపోసుకున్నారు.