జ‌గ‌న్ డ్యూయ‌ల్ మైండ్ పొలిటిక‌ల్ గేమ్!

May 26, 2020

ఒక్క చాన్స్...ఒకే ఒక్క చాన్స్.....అంటూ ఖ‌డ్గం సినిమాలో ర‌వితేజ హీరోగా చాన్స్ కొట్టేసిన‌ట్లు....ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ జ‌గ‌న్ ఏపీ సీఎం అయ్యే చాన్స్ కొట్టేశారు. చాన్స్ రావ‌డ‌మే ఆల‌స్యం.....త‌న అధికారాన్ని ఉప‌యోగించుకుంటూ సీఎం జ‌గన్ పాల‌న సాగిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మ‌వుతోన్నా...ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు స‌రి క‌దా...మ‌రిన్ని అనాలోచిత నిర్ణ‌యాల‌తో త‌నకు వ‌చ్చిన చాన్స్‌ను దుర్వినియోగం చేసుకుంటున్నారు.  ప్ర‌జావేదిక కూల్చివేత మొద‌లుకొని...శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం వ‌ర‌కు....జ‌గ‌న్ తీసుకుంటోన్న నియంతృత్వ నిర్ణ‌యాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయిందని రాజ‌కీయ విశ్లేష‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
కేవ‌లం క‌క్ష సాధింపుతోనే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తున్నార‌న్న‌ది `జ‌గ‌నె`రిగిన స‌త్యం. అయితే, అధికార వికేంద్రీక‌ర‌ణ‌తోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని జ‌గ‌న్ అండ్ కో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఇక తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని తామే బ‌ల‌ప‌రుస్తూ మూడు రాజ‌ధానులు ముద్దంటూ ర్యాలీలు కూడా చేస్తున్నారు. నిజంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం స‌రైన‌దే అయితే వైసీపీ నేత‌లు ర్యాలీలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. ఇక‌, రాజ‌ధాని అనే కాన్సెప్ట్‌పై జ‌గ‌న్‌కున్న అభిప్రాయంలో డొల్ల‌త‌నం బ‌ట్ట‌బ‌య‌లైంది. కేవలం త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసమే జ‌గ‌న్ ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తూ అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారని ప‌లు మార్లు స్ప‌ష్ట‌మైంది.
గ‌త శాస‌న స‌భ స‌మావేశాల్లో రాజ‌ధానిపై జ‌గ‌న్ స్టేట్ మెంట్స్ విడ్డూరంగా అనిపించ‌క మాన‌వు. అస‌లు కాపిటల్ అనే పద‌మే లేద‌న్న జ‌గ‌న్...మ‌రో అడుగు ముందుకేసి సీఎం, కొంద‌రు అధికారుల ఎక్కడుంటే అక్క‌డే కాపిట‌ల్ అన్నారు. అందుకోసం ఊటీ నుంచి దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత పాల‌న‌ను ఉద‌హ‌రిస్తారు. ద‌క్షిణాఫ్రికా వంటి దేశానికి మూడు రాజ‌ధానులున్నాయ‌ని ఉద‌హ‌రించే జ‌గ‌న్....190 దేశాల‌కు ఒకటే కాపిటల్ అన్న విషయంపై నోరు మెద‌ప‌రు. ఓ వైపు కాపిట‌ల్ అక్క‌ర‌లేదంటూనే మ‌రోవైపు, ఏపీ రాజ‌ధాని కట్టుకోడానికి డబ్బులు అడుగుతారు. అస‌లు కాపిట‌ల్ అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్ నిధులెందుకు అడుగుతున్నారో తెలీదు.
ఇక‌, జ‌గ‌న్ తీసుక‌న్న అనాలోచిత నిర్ణ‌యాల‌కు ప‌రాకాష్ట శాస‌న మండ‌లి ర‌ద్దు. పెద్ద‌ల స‌భ ఉండాల‌న్న‌ త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి నిర్ణ‌యాన్ని అప‌హాస్యం చేసేలా జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించారు. మండ‌లి వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని....101 దేశాల్లో పెద్దల సభ లేదు అని జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నారు. కానీ, మండ‌లి ర‌ద్దు వెనుక కూడా జ‌గ‌న్ స్వార్థ ప్ర‌యోజ‌నాలు దాగున్నాయి. అసెంబ్లీలో 151 మంది స‌భ్యుల బ‌లంతో జ‌గ‌న్ తీసుకుంటోన్న అనాలోచిత నిర్ణ‌యాల‌కు మండ‌లిలో టీడీపీ పెద్ద‌లు బ్రేక్ వేస్తున్నారు. మండ‌లిలో సంఖ్యాబ‌లం లేని కార‌ణంతోనే జ‌గ‌న్....త‌న మాటే ఫైన‌ల్ కావాల‌ని మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నారు.
ఏతా వాతా ఎటు చూసినా...జ‌గ‌న్ త‌న‌కు లాభం చేకూర్చే నిర్ణ‌యాల‌ను మాత్ర‌మే తీసుకుంటూ....ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరే నిర్ణ‌యాలుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్ మాట్లాడే ప్ర‌తి మాటా త‌న కోస‌మే....కానీ, ప్ర‌జ‌ల కోస‌మే తాను మాట్లాడుతున్నాన‌నే భావ‌నను క‌లిగిస్తున్నారు. ఈ ర‌కంగా డ్యూయ‌ల్ మైండ్‌తో పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్న జ‌గ‌న్‌....రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోస‌మే అహ‌ర్నిశ‌లు జ‌గ‌న్ పాటుప‌డుతున్నార‌నే విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే గ్ర‌హిస్తార‌న‌డంలో సందేహం లేదు!