రైతులకు చెమటలు పట్టిస్తున్న జగనన్న షరతులు

August 13, 2020

పథకాలు డిజైన్ చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ఆరితేరిపోయారు. జగన్ పెట్టే షరతులు చూసినవారు మారు మాట్లాడలేరు. చంద్రబాబు కంటే తక్కువ మొత్తం సంక్షేమ నిధులకు కేటాయిస్తూ పేరు మాత్రం బాబుకు రెండింతలు కొట్టేస్తున్నాడు. అసలే వేల కొట్లు సృష్టించిన బిజినెస్ బుర్ర కదా సీఎంది. అందుకే షరతులు ఎలా పెట్టాలో, పథకాల్లో ఎలా కోత విధించాలో జగన్ కి తెలిసినంతగా ఏ ముఖ్యమంత్రికీ తెలియదు. అందరి కంటే తక్కువ ఖర్చుపెట్టి, అందరికంటే ఎక్కువ పథకాలు ఇచ్చినట్లు జగన్ చేసే పీఆర్ ఒక రేంజ్ అనుకోండి.

తాజాగా రైతులకు సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. ఎవరికైనా ఈ పథకం జగన్ ప్రారంభించి రైతులకు మేలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ తాను ఈ పథకం ప్రారంభించాను అని క్రెడిట్ తెచ్చుకోవడానకిి ఏడాదిగా ఈ పథకం ఆపేసి, రైతులకు అన్యాయం చేసి ఇపుడు కొత్త పేరుతో ప్రారంభించారు. అసలు ఇది మామూలు క్రియేటివిటీ కాదు.

ఇక ఈ పథకంలో జగన్ వీర లెవెల్ కటింగ్స్ గురించి చివర్లో మాట్లాడుకుందాం... ఈ పథకం గురించి జగన్ ప్రభుత్వం ఏం చెప్పిందో ముందు చూడండి.

సున్నా వడ్డీ సొమ్ము నేరుగా రైతులకే. ఏటా సీజన్ ముగిసే నాటికి వారి ఖాతాల్లో నగదు జమ. 57 లక్షల రైతులకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం.  

------

ఇక అసలు నిజమేంటో చూస్తారా...

ఒక రైతు లక్ష కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఈ పథకం వర్తించదు

అంటే రైతు లక్ష పైన ఒక్క రూపాయి రుణం తీసుకున్నా మొత్తం డబ్బులకు 7% వడ్డీ కట్టాల్సిందే. తెలియకుండా మీరు తప్పు చేసినా జగనన్న రూల్ అంటే రూలే. మళ్లీ మీ ఇష్టం మరి. జగనన్న ఇచ్చే వడ్డీ రాయితీ కోసం మీకు వచ్చే లోను తీసుకోవడం మానేయాలన్నటమాట.

అంటే వడ్డీ రాయితీ కావాలంటే మీ అర్హతను బట్టి కాకుండా జగన్ చెప్పినంత లోనే తీసుకోవాలి.

సింపుల్ గా చెప్పాలి అంటే.... చంద్రబాబు హయాంలో అందరికీ వర్తించిన ఈ పథకం, జగన్ పాలనలో కేవలం కొందరికే వర్తిస్తుందన్నమాట. మీకేమైనా డౌట్లుంటే G.O. 4530 చూసుకోపోండి.