జగన్ గురించి ఓ పెద్ద రహస్యం చెప్పిన జేసీ

June 01, 2020

జగన్ పన్నెండేళ్ల క్రితమే సీఎం అయ్యేవాడే. ?

అది మిస్ అవడానికి జగనే కారణమా?

అంత మంచి అవకాశాన్ని జగన్ ఎందుకు మిస్ చేసుకున్నాడు? 

ఇవే కదా మీ అనుమానాలు. అవును జగన్ తన స్వయంకృతాపరాధంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్ అత్యంత మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నాడని... ఈ మూర్ఖత్వం వల్ల ఏపీ మాత్రమే కాదు... జగన్ కూడా నష్టపోతున్నాడని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. తన మూర్ఖత్వం, అహంకారం వల్లే... కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందే ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ కాలేకపోయాడానికి దీనికి కారణం సోనియా కాదని, జగన్ మాత్రమే అని జేసీ వెల్లడించారు. ఆనాడు అతను అహంకారానికి పోకుండా సావధానంగా ఆలోచించి ఉంటే... అప్పుడే సీఎం అయ్యేవాడని... రోశయ్య తర్వాత జగన్ పేరే తెరపైకి వచ్చేదని ఆయన చెప్పారు. 

ఈరోజు అమరావతి ఉద్యమానికి మరోసారి మద్దతు తెలిపిన జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ఎక్కడుంటే అదే రాజధాని. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒకచోట ఉంటే... అమరావతి తల లేని మొండెం అవుతుంది. దానిని ఏం చేసుకోవాలి అని జేసీ ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని పెడితే ఓకే. లేకపోతే కీలక నిర్ణయం తీసుకుంటాం. జనవరి 23న హైదరాబాదులో రాయలసీమ నేతల సమావేశం నిర్వహిస్తాం. జగన్ వైజాగ్ కే పోతానంటే... గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి పిలుపునిస్తాం అని జేసీ సంచలన ప్రకటన చేశారు. మూడు రాజధానలు మూర్ఖత్వం అయితే, రాజధానిని తీస్కెల్లి ఎక్కడో ఆ మూలన పెడతాం అంటే రాయలసీమ వాళ్లు ఏం చేయాలి. అక్కడికి పోవాలంటే... సద్ది కట్టుకుని రెండ్రోజులు జర్నీ చేయాలా ? అని ప్రశ్నించారు జేసీ. మొత్తానికి ఈయన స్పీడు చూస్తుంటే... చంద్రబాబును కూడా పక్కన పెట్టి జై గ్రేటర్ రాయలసీమ అనేలా ఉన్నాడు.