జగన్ నిజంగా ఈ తప్పులు చేశాడా? - కాక రేపిన బాబు

August 15, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మహానాడు సందర్బంగా అనేక సంచలన ఆరోపణలు చేశారు. వాటిలో కొన్ని తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేశానని జగన్ చెబుతున్నారు. కానీ అవన్నీ అబద్ధాలే అని చంద్రబాబు ఖండిస్తున్నారు. ప్రచారానికి, వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. పథకాలన్నీ దారి మళ్లాయని చంద్రబాబు బల్లగుద్ధి చెబుతున్నారు. ఏడాదిలో జగన్ చేసింది అప్పులు మాత్రమే అన్నారు. 

ఇక చంద్రబాబు మాటల్లో చర్చకు దారితీసిన అంశాలు పరిశీలిద్దామా?

ఏపీలో 2019-20 లో రాబడి గత ఏడాది (62 వేల కోట్లు)తో పోలిస్తే ఈసారి కేవలం 58 వేల కోట్లు

కేంద్రం నుంచి వచ్చే రాబడి 52 వేల కోట్ల నుంచి 46 వేల కోట్లకు పడిపోయింది

అప్పులు 43 వేల కోట్ల నుంచి 86 వేల కోట్లుకు పెరిగాయి.

 

ఇక తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశాలు ఏంటంటే...

* స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడం

* 5.5 లక్షల మంది నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి పదివేలు ఇస్తానని చెప్పి కేవలం 38 వేల మందికి మాత్రమే ఇవ్వడం.

* 6 లక్షల మంది డ్రైవర్లు ఉంటే... 1.8 లక్షల మందికే ఆర్థిక సాయం ఇవ్వడం

* 3 లక్షల మంది చేనేత కార్మికుల్లో కేవలం 80 వేల మందికే సాయం.