టీడీపీలో కొత్త జోష్‌.. ఏం జ‌రిగిందంటే..!

July 11, 2020

ఎప్పుడెప్పుడు ఎవ‌రు మ‌ద్ద‌తిస్తారా? ఎవ‌రు త‌మ‌తో క‌లిసి వ‌స్తారా? అని ఎదురు చూస్తున్న టీడీపీకి అనూ హ్య అవ‌కాశం ఎదురు వ‌చ్చింది. క‌ల‌లో వ‌చ్చిన అదృష్టం క‌ళ్ల‌ముందే ప్ర‌త్య‌క్షమైన‌ట్టు.. తాజాగా జ‌న‌సేనే స్వ యంగా టీడీపీకి ఆహ్వానం ప‌ల‌కడంతో ఇప్పుడు టీడీపీలో కొత్త జోష్ ప్రారంభ‌మైంది. రెండో సారి ఏపీ లో పాలన సాగించాల‌ని భావించిన క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పో టీ చేశారు. తాను ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, ప‌సుపు-కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ వంటి కీల‌క ప‌థ‌కాలు త‌న‌ను, త‌న పార్టీని ఒంట‌రిగానే గ‌ట్టెక్కిస్తాయ‌ని, అధికారాన్ని అప్ప‌గిస్తాయ‌ని అనుకున్నారు.
ఈ నేప‌థ్యంలోనే ఏ పార్టీతోనూ పొత్తు ప్ర‌స్థావ‌న లేకుండానే చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అదేస‌మ యంలో అన్ని పార్టీల‌నూ ఒకే త‌ర‌హాలో విమ‌ర్శించారు. 2014లో త‌న‌కు క‌లిసి వ‌చ్చిన బీజేపీని, జ‌న‌సేనను కూడా ఆయ‌న తిట్టిపోశారు. స‌రే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఓడిపోయి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. దీనికి తోడు.. పార్టీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాయ‌కులు జారిపోతున్నారు. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య త లేదు. ఈ క్ర‌మంలో ఒక‌ప‌క్క పార్టీని నిల‌బెట్టుకునేందుకు, మ‌రోప‌క్క‌, ప్ర‌తిప‌క్షంగా ప్ర‌జ‌ల్లో మార్కులు వేయించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వెళ్లాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు.
అయితే, అది త‌న ఒంట‌రి ప‌య‌నంతో సాధ్యం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఐదు మాసాల ముందు శ త్రువులైన బీజేపీ, జ‌న‌సేన‌ల‌ను కొన్ని రోజుల కింద‌ట చంద్ర‌బాబు బ‌హిరంగ వేదిక‌పైనే పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో అంద‌రూ చంద్ర‌బాబు ఇక‌, ఈ రెండు పార్టీల‌తోనూ క‌లిసి ప్ర‌యాణం చేసేందుకు సిద్ధ‌ప‌డ్డార‌నే అనుకునేలా బాబు సంకేతాలు పంపారు. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ స్పందించ‌లేదు. పైగా తా ము దూరం పాటిస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే టీడీపీని విలీనం చేయాల‌ని ప్ర‌క‌టిస్తూ.. కానీ, ఇప్పుడు హ‌ఠాత్తుగా జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం నేరుగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి.. తాను రేపు చేప‌ట్ట‌నున్న విశాఖ లాంగ్ మార్చ్‌కు మ‌ద్ద‌తు కోరారు.
దీంతో వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు అయ్యింది. విశ్లేష‌కుల అభిప్రాయాల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆయ‌న వెంట‌నే ప‌వ‌న్‌కు జై కొట్టారు. లాంగ్ మార్చ్‌కు టీడీపీలోని సీనియ‌ర్లు హాజ‌ర‌వుతార‌ని, ప‌వ‌న్‌కు తమ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అన్నారు. ఏదేమైనా 7 శాతం ఓట్ల షేర్ సాధించిన జ‌న‌సేన ఈ ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని దెబ్బేసింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు క‌లిసి పోరాటం చేస్తే బ‌లంగా ఉన్న వైసీపీని గ‌ట్టిగా ఢీ కొడితే ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లీ ర‌స‌కందాయంలో ప‌డ‌తాయి.