ఓరి నాయనో... జగన్ భాషా జ్జానం పిచ్చెక్కిస్తోంది

February 22, 2020

ఒక వేలుతో ఒకడిని అంటే నాలుగేళ్లు మనల్ని అంటాయన్న చిన్న విషయాన్ని జగన్ బాబు మిస్ అయినట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాళ్లు వేయటానికి అవకాశం ఉంటే.. అధికారంలోకి వచ్చినంతనే రాళ్ల దెబ్బలకు రెఢీ కావాలి. అందుకే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా.. ఎంతమాట పడితే అంత మాట అనేస్తే వచ్చే తిప్పలు ఎలా ఉంటాయనటానికి తాజాగా జగన్ బాబుకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పుదు.

మాట్లాడే వేళ.. తప్పులు దొర్లటం సహజం. దాన్ని పట్టుకొని రార్దాంతం చేసి.. నారా లోకేశ్ లాంటోళ్లను పప్పు మాష్టారుగా ప్రపంచ ప్రసిద్ధి చేసేసిన జగన్ ఇప్పుడు తనకు తానుగా అడ్డంగా దొరికిపోతున్నారు. చూడకుండా మాట్లాడే సమయంలో మాట తడబడటాన్ని కామెడీ చేసుకున్న వారు.. ఈ రోజున పేపర్ మీద ఉన్న దాన్ని కూడా సీఎం జగన్ మాష్టారు చదవలేకపోవటం.. చదివిన నాలుగు లైన్లలో నాలుగు తప్పులు దొర్లటం చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు.
లోకేశ్ ను అదే పనిగా ఆడిపోసుకున్న వారికి షాకులు ఇస్తూ.. జగన్ మాట్లాడిన మాటల్లోని తప్పుల్ని ట్విట్టర్ సాక్షిగా వీడియోను పోస్టు చేసిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. టీడీపీ నేత కమ్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిపై సెటైర్లు వేస్తూ..  చూడకుండా ప్రసంగించేవాడు తప్పు మాట్లాడితే పప్పు అన్నారు. మరి..చూసి కూడా తప్పు మాట్లాడిన వారిని ఏమనాలి? అని ప్రశ్నించారు. చూడకుండా మాట్లాడే సమయంలో తప్పుగా మాట్లాడితే పప్పు అన్నారని.. మరి నాయకుడుచూసి కూడా తప్పు మాట్లాడినోళ్లను ఏమనాలి? ముద్దపప్పు అందామా? అంటూ విజయసాయి రెడ్డికి పర్ ఫెక్ట్ పంచ్ వేశారు తెలుగు తమ్ముడు. అందుకే అంటారు.. వేలెత్తి చూపించే ముందు మిగిలిన వేళ్లు మనవైపే చూపిస్తాయన్న సోయితో మాట్లాడే ఇలా చిత్తు కావటం ఉండదుగా విజయసాయి?