తెలంగాణను దాటేసిన ఏపీ ... భారీగా కొత్త కేసులు !

May 31, 2020

దేవుడి దయవల్ల 10 కేసులే అని ఏపీ ముఖ్యమంత్రి మురిసిపోయాడు. కానీ ఆరోజే దీనిపై పెద్ద చర్చ జరిగింది. టెస్టులు చేయకుండా మురిసిపోతే ఏం లాభం... అనునమానితులకు పరీక్షలు చేసి నెగెటివ్ రిపోర్టులు వచ్చాక ఇంతే నెంబరు ఉంటే అందరూ సంతోషిద్దాం అని అందరూ అభిప్రాయపడ్డారు. ఎవరి మాట వినే అలవాటు లేని ముఖ్యమంత్రి కదా. తన మానాన తాను తనకు నచ్చింది చెప్పకుంటూ పోయారు... కట్ చేస్తే ఏపీలో సీన్ తిరగబడింది. కేసుల్లో తెలంగాణను మించిపోయింది.

ఏపీ సర్కారు అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏపీలో కేసుల సంఖ్య 111. ఈ ఒక్కరోజే 24 కొత్త కేసులు యాడ్ అయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఏపీ ప్రమాదకర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో వరుసగా 47, 24 చొప్పున పెరగడం ప్రమాద ఘంటికే. 

ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి జగన్... కరోనాను తీసిపారేశారు. ఇది చిన్న వ్యాధి అని, జ్వరానికి చేసిన ట్రీట్ మెంట్ చేస్తే సరిపోతుందని అనేస్తున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా సీఎం ఉంటే ఎపుడు ఏపీ ఈ కష్టాల నుంచి బయటపడేది? కేసులు నమోదవుతున్న తీరు చూసి ఏపీ ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాదు నుంచి అనవసరంగా సొంతూరికి వచ్చామా అన్న కొత్త బెంగ వారిలో మొదలైంది.