గేమ్ మొదలుపెట్టిన జగన్ 

June 06, 2020

దేశ వ్యాప్తంగా కరోనా పోరులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. కేసుల పెరుగుదల రేటులో దేశంలో ఏపీ టాప్ 5 లో ఉంది. ఈ నేపథ్యంలో ఎంతో చురుగ్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మాయలో పడి కరోనాను పట్టించుకోలేదు. నిమ్మగడ్డ మీద కోపంతో కరోనాను సప్రెస్ చేసి చూపే ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవం, తీవ్రత అర్థమై కరోనాను ఎదుర్కోవడంలో కిందా మీద అవుతున్నారు. దేశంలో అత్యధిక ప్రాంతం రెడ్ జోన్ గా ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ రికార్డుకు ఎక్కింది. దీంతో దేశ వ్యాప్తంగా పరువుపోయింది. అమెరికాలో ట్రంప్ చేసిన తప్పే జగన్ ఏపీలో చేశాడు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ కమ్మ కార్డును మరోసారి బయటకు తీశాడు. జగన్ కి కష్టం వచ్చినపుడల్లా కమ్మకార్డు గుర్తుకు వస్తుంది. 

తాజాగా రాయపాటి మాటలను వివాదాస్పదం చేసి కరోనా వైఫల్యంపై చర్చ జరగకుండా చేసే ప్రయత్నం ఇది. రాయపాటి ఏమన్నారంటే.... ముఖ్యమంత్రి అంరదినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. కమ్మవాళ్లను అదేపనిగా పక్కకు పెడుతున్నారు. ఎస్పీలకు ఫోన్లు చేసి కమ్మవారికి సాయం చేయొద్దు అని చెబుతున్నాడు. కమ్మ కులంపై వివక్షత గురించే తాను మాట్లాడాను. జగన్ కంటే ముందు ఆయన తండ్రి నాకు చాలా సన్నిహితుడు. జగన్ మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. నేను అనని మాటలు ప్రచారం చేసి... నాకే బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి తీరుతో ఏపీకే కాుద, నీకు కూడా నష్టం జగన్ అని రాయపాటి వ్యాఖ్యానించారు. కమ్మ వాళ్లు తలచుకుంటే జగన్ అయిపోతాడు అని రాయపాటి అన్నట్లు వైసీపీ నేతలు కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవం వేరు. అసలు రాయపాటి అలా వ్యాఖ్యానించిన వీడియో లేనేలేదు. మరి ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు అంటే ఇదికేవలం కరోనా డైవర్ట్ అని అర్థమవుతోంది. 

కరోనా విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాయపాటిని జగన్ క్యాచ్ చేశారు. సీఎం నుంచి సర్పంచి వరకు పొద్దున లేస్తే వైసీపీ వాళ్లు కమ్మలపై ఆరోపణలు చేసేది వైసీపీ. కానీ ఇపుడేమో అమాయకుల్లా కులం గొడవలు రేపి జగన్ ని చంపేస్తారా అంటూ అసలు కులం గురించి తెలియని వ్యక్తిలా మాట్లాడతారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. హైకోర్టు ఇంగ్లిష్ మీడియం పెట్టొద్దని చెప్పలేదు. కానీ విద్యార్థులకు ఏ భాషలో అయినా చదివే ఆప్షన్ ఉండాలని కోర్టు చెబితే దానిని చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తారు. అంటే వీరు చేసే ప్రతిపని జనంలో పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి తప్ప జనంపై ప్రేమతో కాదు. ఈ విషయం ప్రతిసారీ బయటపడుతుంది. ప్రతిసారీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం కోర్టుతో తిట్టించుకోవడం ఇదే జరుగుతోంది జగన్ పాలనలో. అయినా వారు మారరు. 

తాజాగా ఇంగ్లిష్ మీడియం విషయంలో, కరోనా విషయంలో, రేపేమాపో నిమ్మగడ్డ విషయంలో జగన్ కి తగులుతున్న దెబ్బలకు దిమ్మతిరిగి తనకు జరిగిన అవమాానాన్ని సప్రెస్ చేయడానికి జగన్ ఆడుతున్న గేమ్ అటాక్ కమ్మ. ప్రజలు గమనిస్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే.. క్రిస్టియన్ ఓటు బ్యాంకు, రెడ్డి ఓటుబ్యాంకు, అమ్మ ఒడి ఓటు బ్యాంకు, ఇళ్ల స్థలాల ఓటు బ్యాంకు, తాజాగా ఫీజు రీఎంబర్స్ మెంట్ కాలేజీలకు ఇవ్వకుండా విద్యార్థి తల్లులకు ఇచ్చి క్రియేట్ చేసుకోబోతున్న ఓటు బ్యాంకు ఇవన్నీ భద్రంగా చూసుకుంటున్నాడు జగన్. అతను ఒక్క అభివృద్ధి పథకం చేయకపోయినా... ఎందుకు అంత భరోసాగా ఉన్నాడంటే ఆ డబ్బును పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నాడు. కాబట్టి భరోసాగా ఉంటాడు. నాశనం అయ్యేది రాష్ట్ర భవిష్యత్తే గాని జగన్ భవిష్యత్తు కాదు.