రద్దుల రెడ్డి... జగన్ సూపర్ హిట్ నేమ్

February 24, 2020

రాజకీయనాయకులకు జనం నిక్ నేమ్ లు పెడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రమే అవి పేలుతాయి. అయితే... జగన్ విషయంలో మాత్రం ఇవి అనేక సార్లు పేలుతున్నాయి. గతంలో ఆయన పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటే... అది చాలామందికి కనెక్టయ్యింది. వాస్తవానికి ఆ పార్టీలో ఉన్న నేతల్లో అత్యధికులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు కావడంతో ఆ పేరు ఆ పార్టీకి అలా సింక్ అయిపోయింది. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ప్రతి దానిని కూల్చడం, లేదా రద్దు చేయడం చేస్తున్నారు. ఆయన రద్దు చేసిన కార్యక్రమంలో అతిపెద్దది ఇసుక రద్దు. 

5 నెలల పాటు ఇసుక రద్దు కావడంతో జనం అల్లాడిపోయారు. రియల్ రంగం కుప్పకూలింది. పేదల కడుపు కాలింది. అయినా పట్టించుకోలేదు. ఇక ప్రజలు నేరుగా దండయాత్ర చేస్తారేమో అన్న పరిస్థితి వచ్చాక జగన్ దిగొచ్చారు. కానీ... తెలుగుదేశం హయాంలో నగరాల్లోనే ఇసుకకు డబ్బులు తీసుకునే వారు. అది కూడా ట్రాన్స్ పోర్ట్ ఖర్చే. ప్రజలే ఇసుక తెచ్చుకోవాలనుకుంటే అది ఉచితమే. కానీ ఇపుడ పల్లె పట్టణం తేడా లేకుండా ఎక్కడైనా ఇసుక కాస్ట్లీ అయిపోయింది. 

ఇసుక తర్వాత జగన్ రాజధానిని రద్దు చేశారు. అది ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వ్యతిరేకతకు కారణమైంది. ఆ తర్వాత తనను హర్ట్ చేస్తోందని మండలి రద్దు చేశారు. సరే ఇదంటే ప్రజల సబ్జెక్టు కాదు కాబట్టి ప్రజలు నేరుగా పట్టించుకోకపోవచ్చు. అయితే... 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని అబద్ధం చెబుతున్న ప్రభుత్వం ఇచ్చింది కేవలం 2 లక్షల ఉద్యోగాలే. ఈ లెక్క ఏపీ గవర్నమెంటు అధికారిక వెబ్ సైట్లలో చూడొచ్చు. అయితే ఈ క్రమంలో అంతకంటే ఎక్కువమంది ఉద్యోగాలను జగన్ పీకేశారు. సింపుల్ గా చెప్పాలంటే... మీ సేవ కేంద్రాలను మూసేసి అదే పనిని తనకు నచ్చిన వాళ్లకి ఇచ్చి చేయిస్తున్నారు అంతే. 

అంతేకాదు, ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను రద్దు చేశారు. తర్వాత ప్రజలకు ఇచ్చే రుణమాఫీని రద్దు చేశారు. ఇలా ఒకటీ రెండు కాదు... తనకు గుర్తు వచ్చిన ప్రతిదానిని రద్దు చేశారు. దీంతో జగన్ కు ’రద్దుల రెడ్డి’ అని ఒక పేరు పెట్టేశారు జనం. ఇంతవరకు జగన్ కి పెట్టిన అన్ని పేర్లకంటే ఇదే సూపర్ హిట్. అసలు జగన్ రద్దులపై ఇంటర్నెట్ లో ఒక పెద్ద జోక్ వైరల్ అవుతోంది. ’’కరోనా వైరస్ చైనాలో వచ్చింది కాబట్టి బతికిపోయింది... ఆంధ్రాలో వచ్చి ఉంటే... జగన్ దానిని రద్దుచేసేవారు’’ అంటూ పేల్చిన ఒక జోక్ ఓ రేంజిలో పేలింది. అంటే... ఇకపై జగన్ రెడ్డి కాస్తా రద్దుల రెడ్డి అయ్యారన్నమాట. మరీ ఇన్నిటిని రద్దు చేస్తే ప్రజలు మాత్రం ఏం చేస్తారు?