జగన్ కాన్ఫిడెన్స్ డౌన్... 130 నుంచి హంగ్ దాకా !!

September 18, 2019

వైసీీపీ తరఫున పోటీచేసిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులకు పార్టీ నుంచి పిలుపు వచ్చింది. 21 వ తేదీ తాడేపల్లిలో మీటింగ్. జగన్ ఇంట్లోనే మీటింగ్. ఎన్నికల ముందు ఇలాంటి మీటింగ్ అంటే సన్నాహకాలు అనుకోవచ్చు. లెక్కింపునకు ముందు ఈ మీటింగ్ పెట్టాడంటే.... కొత్త అనుమానాలు వస్తున్నాయి.
130 సీట్లకు తగ్గవు అని ఫీలయిన జగన్ కి ఏమైంది?
ఈ సడెన్ మీటింగ్ వెనుక మర్మం ఏమిటి?
21వ తేదీన అభ్యర్థులకు ఏం చెప్పబోతున్నారు?
23వ తేదీన జగన్ ఎక్కడ ఉండబోతున్నారు?
అందరి మదిలో అనేక ప్రశ్నలు. విషయం ఆరా తీస్తే చాలానే తెలిశాయి. బయటకు ఎంత చెప్పినా ఏం చెప్పినా? గెలుపు మీద వైసీపీ అధినేతకు భరోసా పూర్తిగా తగ్గిందట. ఇద్దరూ హోరాహోరీగా ఉండేలా ఉందని తెలిసిందట. హంగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మెజారిటీ రాకపోయినా ఎక్కువ సీట్లు వస్తే ఎమ్మెల్యేలను క్యాంపులు ఏర్పాటుచేసి కాపాడుకోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 21వ తేదీ సంబంధిత సమాచారం అందచేయడానికి సామదానబేధ దండోపాయాలు వాడేందుకు జగన్ ఒక మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున హంగ్ వస్తే... ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోకుండా ఉన్నవారిని కాపాడుకునే ప్లాన్ ఏతో పాటు వీలైతే కేసీఆర్ అండతో ఇంకొందరిని కొనే ప్లాన్ బి కూడా జగన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే... ఒక్క విషయం మాత్రం బాగా స్పష్టమవుతోంది. గతసారి పదేపదే జగన్ తన విజయం గురించి మాట్లాడాడు. కానీ ఈసారి ఎన్నికల తర్వాత ఒకట్రెండుసార్లు మినహా ఎపుడూ కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్పలేకపోయారు పార్టీ గెలుస్తోంది. ఆ పార్టీలో విజయసాయిరెడ్డి ఎగిరెగిరి పడటమే తప్పించి జగన్ లో మాత్రం పార్టీ విజయంపై కాన్ఫిడెన్స్ లేదంటున్నారు.
మే 23 న ఎవరికి ఏ అద్భుతం జరుగుతుందో వేచి చూడాల్సిందే. వేరే మార్గం లేదు.