బీజేపీ దెబ్బ - జగన్ కొత్త సంచలన నిర్ణయం

February 28, 2020

బీజేపీ ఇటీవల జగన్ ను యాంటీ హిందు జగన్ అని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఏపీ బీజేపీ ఈ హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేసింది. దీంతో ఈ ముద్ర తొలగించుకోవడానికి జగన్ కొత్త ఐడియాను వేశాడు. బీజేపీ నేత‌లు, ఆర్ ఎస్ ఎస్ సానుభతి ప‌రులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న విష‌యంపై సీఎం జ‌గ‌న్ దృష్టిసారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఇతరత్రా అన్ని హిందూ దేవాలయాల్లో పనిచేసేందుకు హిందువులకు మాత్రమే పనిచేయాలని ఒక జీవో తెస్తున్నారు. ఇతర మతస్తులు ఎక్కడైనా పనిచేస్తుంటే... ప్రభుత్వంలోని ఇతర శాఖలకు పోవాలి అని అంటున్నారు.  ‘దేవాలయాల్లోని ఉద్యోగులుగా హిందువులు మాత్రమే ఉండాలి. వేరే మతాలను అనుసరించే వారు వేరే శాఖల్లోకి వెళ్లాలి’ అంటూ ఈ రోజు ప్రభుత్వం ఆదేశించింది.

ఈ డిమాండ్ ఇప్ప‌టిది కాదు, రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాల‌రావు ఉన్న‌ప్పుడే ఈ డిమాండ్‌పై దృష్టి పెట్టారు. బీజేపీ అజెండాను అమలుచేశారనే నింద వేస్తారని పట్టించుకోలేదు. మిగిలిన వ‌ర్గాల్లో పార్టీ ప‌లుచ‌న చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయని చంద్రబాబు వెనుకంజ వేశారు.  ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాను బేసిగ్గా క్రిస్టియన్ కాబట్టి... బీజేపీ వేసిన నిందను తుడిపేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.


హిందూ ఆల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల ఇళ్ల‌లో ..  క్రైస్తవులు లేదా ముస్లింలు జ‌రుపుకొనే పండ‌గ‌లు జ‌రుపుకొన్నా..  పెళ్ళిళ్ళు ప్రార్థనలు ఆయా సంప్ర‌దాయాల్లో చేసుకున్నా.. కూడా ప్ర‌భుత్వం నిఘా పెట్ట‌నుంది. సంబంధిత‌ వీడియోలను విజిలెన్స్ శాఖకు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కు అందిస్తే... వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి. ఆయా సమాచారం నిజమేనని రుజువైన పక్షంలో... సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు. మొత్తంగా ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఇప్ప‌టికైనా బీజేపీ వారి ఆలోచ‌నా ధోర‌ణి మారుతుందో లేదో చూడాలి