గల్లా జయదేవ్ కి జగన్ షాక్

July 04, 2020

ఏపీలో టీడీపీ నేతలకు షాకులు తగులుతూనే ఉన్నాయి. మొన్ననే పెట్టుబడుల ప్రోత్సాహంలో భాగంగా నిబంధనలకు అనుగుణంగా సరస్వతి కంపెనీకి సదుపాయాలు కల్పించామని సమర్థించుకున్న ప్రభుత్వం తాజాగా చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు షాక్ ఇచ్చింది. 2009లో అంటే కాంగ్రెస్ హయాంలో 483.27 ఎకరాల భూమి ఆ సంస్థకు కేటాయించగా, తాజాగా అందులో ఈ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏపీఐఐసీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో కేటాయించిన ఈ భూమి చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలో ఉంది. ప్రస్తుతం సర్వే నెం 65/1 భూములు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.