ఏపీ అసెంబ్లీపై జగన్ సంచలన నిర్ణయం

May 31, 2020

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో పాలన అస్తవ్యస్థంగా తయారైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వ హయాంలో ఏపీ పురోగమిస్తుంటూ....ప్రస్తుతం జగన్ పాలనలో తిరోగమనం పాలవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా...భావి భారత ప్రతిష్టాత్మక నగరంగా అమరావతి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయేలా చంద్రబాబు చేస్తే.....అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ...కక్ష సాధింపుతో అక్కడ చంద్రబాబు నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తూ...జగన్ అమరావతి పేరును భ్రష్టుపట్టించారు. ప్రపంచమంతా ఒక రాజధాని చాలంటుంటే....తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటోన్న జగన్....తాను పాలిస్తోన్న రాష్ట్రానికి మూడు రాజధానులంటూ మొండిపట్టు పట్టి విమర్శల పాలవుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజా వేదికను కూలగొట్టిన జగన్....తాజాగా అసెంబ్లీ భవనంపై కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే జాతీయ రహదారికి సమీపంలో కొత్త అసెంబ్లీ నిర్మించేందుకు జగన్ మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలు మూడు రాజధానుల ప్రతిపాదనే దండగ అని విమర్శలు వస్తుంటే...తాజాగా...అసెంబ్లీ భవనంపై జగన్ మరో తప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ వస్తోంది. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని ప్రకటించిన జగన్....ఇపుడు దానిని విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక, అక్కడ ఖాళీ అయ్యే భవనాలను వేరే కార్యకలాపాలకు ఉపయోగిస్తారట. సచివాలయాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తారట. ఎమ్మెల్యేల, అధికారుల నివాసాలను నాగార్జున విశ్వవిద్యాలయ కళాభవనం పేరిట.....నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ, అధికారుల నివాసాలకు, వర్సిటీ ఇతర అవసరాలకు ఇస్తారట. మిగతా భవనాల కేటాయింపు సంగతి పక్కనబెడితే...తన మాట ప్రకారం అసెంబ్లీ భవనం అమరావతిలో ఉండాలన్న లాజిక్ ను జగన్ మరిచిపోయారు. అంతేకాకుండా....కోట్లు ఖర్చుపెట్టి కట్టిన భవనాన్ని వదిలేసి....మరిన్ని కోట్లు తగలేసి కొత్త భవనం కట్టాలని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే, సోషల్ మీడియాలో జగన్ పాలన...పిచ్చోడి చేతిలో రాయి...అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ భవనాల కేటాయింపు, అసెంబ్లీ కొత్త భవనంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది...అసలు వస్తుందా లేదా అన్న సంగతి జగన్ మోహనుడికే ఎరుక.