జగన్ ఈ పథకం.. ప్రతిపక్షాలకు మరణశాసనమే

June 03, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చరిత్రను తిరగరాస్తున్నారు. ప్రపంచమంతా అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలను మోడల్ గా తీసుకుంటూ ఉంటే జగన్ మాత్రం ఎవ్వరూ పట్టించుకోనివి... అభివృద్ధి పథంలో వేగం లేనివి, లేదా వెనుక బడిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. మూడు రాజధానుల విషయం ఒక ఫెయిల్యూర్ మోడల్. ప్రపంచమంతా దీనిని పట్టించుకోలేదు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో చాలా అరుదగా దక్షిణాఫ్రికాలో ఉన్న మూడు రాజధానుల మోడల్ ఆంధ్రలో పెడితే బాగుంటుంది అంటూ దాని వెంట పడ్డారు జగన్ రెడ్డి. అనేక న్యాయపరమైన చిక్కులు దాటుకుని అది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియని పరిస్థితి. ఇపుడు ఏ మంత్రిని ఏపీ రాజధాని ఏది అని అడిగినా చెప్పలేని పరిస్థితి.

ఇక తాజాగా విద్యావిధానాన్ని ఆయన రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రష్యాలో లాగ మనవాళ్లు కూడా ఉన్నత చదువులు చదవాలట. అందుకోసమే వసతి దీవెన పెడుతున్నాను అన్నారు. ఈ పథకం కింద డిగ్రీ, పీజీలు చేసేవారికి 20 వేల రూపాయలు వసతి కోసం డబ్బులు ఇస్తారట. మనోళ్లు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని రష్యాలాగా బాగా చదువుకోవాలని అంటున్నారు జగన్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బులు కాకుండా ఇవి అదనం అన్నమాట. అంటే చదువు ఖర్చు కాకుండా అదనంగా ఉండటానికి హాస్టల్ డబ్బులు  చేతికి ఇస్తారు. 

ఇది పార్టీని బలపరుచుకోవడానికి జగన్ ప్రయోగించిన ఒక బలమైన అస్త్రం. ఒక రకంగా ప్రతిపక్షాలకు మరణశాసనం. యువత మొత్తాన్ని ప్రజల డబ్బులతో తన వైపు తిప్పుకునే ప్లాన్. ఇందులో ప్రజా ప్రయోజనం శూన్యం అంతా పార్టీ ప్రయోజనమే అని స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా ప్రభుత్వం ప్రజలు మేలుకోరేదే అయితే... డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇలా డబ్బులు చేతికి ఇవ్వకుండా వసతి గృహాలు నిర్మించేది. వాటిలో సదుపాయాలు కల్పించేది. కానీ జగన్ పథకం వల్ల ఏటా ప్రజాధనం వృథా అవుతుంటుంది గాని భావి తరాలకు ఏమీ ఒరగదు. అదే ఒక ఏడాది లేటయినా... ఆ డబ్బులతో హాస్టళ్లు నిర్మిస్తే డిగ్రీ పీజీ చదివే ప్రతి విద్యార్థికి వసతి ఉచితంగా దొరుకుతుంది. ఒక తరం మొత్తం బతికేస్తారు. జగన్ ఇవ్వాలనుకున్న డబ్బులకంటే కూడా అది ఎక్కువ ప్రయోజనం. అలా చేస్తే ప్రజలకు లాభమే కానీ జగన్ కు కాదు. 

ఈ పథకం నిశితంగా పరిశీలిస్తే రెండు కీలకమైన విషయాలు అర్థమవుతాయి. ఇంటర్ అయిపోయాక ఒక విద్యార్థి వయసు 17-18 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే సరిగ్గా ఓటు హక్కు పొందే సమయం. ఈ సమయంలో 10 వేలు చొప్పున ఏటా రెండు సార్లు విద్యార్థులకు 20 వేల రూపాయలు అందిస్తారు. అంటే విద్యార్థికి (తల్లిద్వారా) నగదు బదిలీ పథకం అన్నమాట. ఈ 20 వేలు ఇలా డిగ్రీలో మూడేళ్లు, పీజీలో రెండేళ్లు ఐదేళ్లు అందుకుంటే అంతలోపు ఎన్నికలు వస్తాయి. అంటే లక్ష రూపాయల ప్రజల సొమ్ము ఒక విద్యార్థి ఉన్న కుటుంబానికి అందుతాయి. వాటిని ఓట్లుగా మలిచే పక్కా ప్రణాళిక ఇది. 

విజన్ తో హాస్టల్ కడితే ఏమొస్తుంది? ఏం రాదు. అదే చేతికి డబ్బు ఇస్తే జగన్ పథకం ద్వారా ఇంచ్చారు అని అంటారు. పైగా పార్టీ మౌఖిక కండిషన్లతో ఇస్తారు. అలా చేయకపోయినా లక్ష రూపాయలు ఇస్తే 3 ఓట్లు వేయకుండా ఉంటారా? జనం? కచ్చితంగా వేస్తారన్నదే పార్టీ అంచనా. చేపలు పట్టడం నేర్పితే చేపలు పట్టుకుని బతుకొచ్చు. చేపలు ఇస్తే... ఆ రోజు కూర వండుకుని తినేస్తారు. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ చేపలు ఇచ్చేవే గాని చేపలు పట్టడం నేర్పించేవి కాదు. జగన్ కు ఆ అవసరం కూడా లేదు. యథా ప్రజ... తథా రాజ. ప్రజలకు డబ్బులు కావాలి, పాలకులకు అధికారం కావాలి... ఇద్దరికీ అండ్ స్టాండింగ్ ఉంది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్. 

 కొసమెరుపు - అదేం యాదృఛ్చికమోగాని జగన్ కేవలం క్రిస్టియన్ కంట్రీలనే ఆదర్శంగా తీసుకుంటారు. దక్షిణాఫ్రికా, రష్యాల్లో 75 శాతం పైగా ప్రజలు క్రిస్టియానిటీని ఆచరిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మతం కూడా క్రిస్టియానిటీ కావడం గమనార్హం.