జగన్ స్కెచ్ లో జీఎన్ రావు ఒక పాత్ర మాత్రమే ? అంతకుముందు ఏం జరిగింది

February 26, 2020

జనానికి తెలిసి... రాజధాని ప్రకటన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ ప్రకటన తర్వాత జరుగుతోంది.

జగన్ ప్లాన్ లో విశాఖ రాజధానిగా ఎపుడో ఫిక్సయిపోయింది. ఆ తర్వాత జరిగిందంతా డ్రామా?

రాజకీయ, సామాజిక, వర్గ సమీకరణాల అనంతరం అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, ప్రజలందరినీ సోషల్ మీడియా ద్వారా డైవర్ట్ చేయించి.... అయితే అమరావతి, పోతే దొనకొండ అన్న భ్రమలో పెట్టి సైలెంటుగా విశాఖపట్నంలో స్కెచ్ వేసుకున్నారట వైసీపీ బృందం. అన్నీ సిద్ధం చేసుకున్నాక... శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు మాత్రమే నిపుణుల కమిటీ అనే ఒక డ్రామా. అసలు దీని వెనుక చాలానా జరిగింది అంటున్నారు.