అమెరికాలో జగన్ పబ్లిసిటీ వైరల్

August 10, 2020

అమెరికాలో ఏపీ ప్రభుత్వం వీడియో సందేశం ద్వారా ఎన్నారైలకు భరోసా ఇచ్చింది. న్యూయార్క్ లోకి ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి సందేశాన్ని వీడియలో ప్రదర్శించారు. ఏపీ ప్రభుత్వ అమెరికా ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ముఖ్యమంత్రి జగన్ పంపిన సందేశాన్ని అక్కడ వీడియోలో ప్రదర్శించారు. అమెరికాలో కరోనా మహమ్మారి విపరీతంగా కబలిస్తోంది. 3000 మంది చనిపోయారు. లక్ష 67 వేల మంది సోమవారం నాటికే దీని బారిన పడ్డారు. వ్యాధి విస్తరణ, కరోనా మరణాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉండిపోయిన ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కరోనా సుమారు 40 వేల మందిని బలితీసుకుంది. అత్యధికులు వృద్ధులే అయినా... అన్ని వర్గాల వారు దీని బారిన పడుతున్నరు. న్యూయార్క్ అయితే చిగురుటాకులా వణికిపోతోంది. అక్కడి భయానక దృశ్యాలు డాక్టర్లకు పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఎన్నారైల్లో భరోసాను నింపడానికి " మీరు అక్కడ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండండి.. ఏపీలోని మీ కుటుంబసభ్యుల పట్ల మేం జాగ్రత్త వహిస్తాం" అంటూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రదర్శించారు. 

ఏపీలో ఉన్నవారు అమెరికాలో ఉన్న తమ వారి గురించి ఆందోళన చెందుతుంటే... అమెరికాలో ఉన్న వారు తమ బంధువల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ఇలా వీడియో సందేశం అమెరికాలో ఇదే తొలిసారి. వాస్తవానికి ఇపుడు ఎవరూ బయటకు వచ్చి దీనిని చూసే పరిస్థితి లేదు. కాకపోతే ఆ సందేశం అక్కడ ప్రదర్శిస్తే వైరల్ అవుతుందని అందరికీ రీచ్ అవుతుందని ఈ ప్రయత్నం చేసినట్టున్నారు.