జగనన్న భయపడ్డాడురోయ్ !

May 27, 2020

దేశంలో ఏం నడుస్తోంది? 

కరోనా

ఏపీలో ఏం నడుస్తోంది? 

రాజకీయం.

దేశంలో ఎవరు జాగ్రత్తలు చెబుతున్నారు

ఆయా రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు

ఏపీలో ఎవరు జాగ్రత్తలు చెబుతున్నారు?

ప్రతిపక్ష నేత. 

ఇది ఏపీ ప్రజల దుస్థితి. ప్రపంచం వణికిపోయి.. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా ప్రజలు భయపడనంతగా కరోనాకు భయపడుతుంటే ఎన్నికల గురించి ఏపీ నాయకుడు చర్చిస్తున్నాడు. ఫీలవుతున్నాడు. ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. తమకు ఎక్కడ కరోనా వస్తుందో అని ఏపీ ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కానీ జగన్ బాధ అంతా ఎన్నికలు, తన సంక్షేమ పథకాల గురించి తప్ప మరి దేని గురించీ కాదు. కరోనా గురించి ఏపీ సర్కారు ఎలాగూ పట్టించుకోవడం లేదు. ఎందుకయినా మంచిది అని ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదావేశారు. మంచి పనికి సంతోషించకుండా జగన్ దాని గురించి తీవ్రంగా బాధపడి కమ్మోడు, మాకు ద్రోహం చేస్తున్నాడు అంటూ లేనిపోని లేఖి ఆరోపణలు చేశారు. 

కట్ చేస్తే... ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఎత్తేసి భూ పంపిణీకి మార్గం సుగమం చేసిన తనంతట తానే జగన్ ఇపుడు ఆ కార్యక్రమాన్ని ఏప్రిల్ కి వాయిదావేశారు. అంటే తత్వం బోధపడింది. ప్రమాదం తెలిసివచ్చింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నడుస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. స్వయంగా కర్ఫ్యూ పాటించండి అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఇటలీలో రోజుకు వందలాది మంది చనిపోతున్నారు. వారి నిర్లక్ష్యం వారి పాపమైంది. ఆ నిర్లక్ష్యం మనం చేయకుండా దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ప్రతినబూనాలి అని ప్రధాని పిలుపునివ్వడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జగన్ కి అర్థమైంది. 

అయినా తాను తప్పు ఒప్పుకుంటే ఎక్కడ అవమానపడతానో అని... కరోనా ఎదుర్కోవడానికి వలంటీర్లు బాగా కృషి చేస్తున్నారు.  ఎన్నికలు జరిగి ఉంటే వారు కూడా సహాయపడేవాళ్లు. అది జరగలేదు. పేదలకు స్థలాలు ఇస్తుంటే కొందరు కేసులు వేస్తున్నారు అంటూ తన అసమర్థతను ముఖ్యమంత్రి దాచే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రోజురోజుకు పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  అపుడు ఫ్రస్ట్రేషన్లో జగన్ కి అర్థం కాలేదు గాని ఇపుడు ఫుల్ క్లారిటీ ఉంది. ఏప్రిల్ లో కనుక కరోనా అంత కాకపోతే ఎన్ని ప్రభుత్వాలు కూలిపోతాయో చెప్పలేని పరిస్థితి. జనాన్ని కాపాడలేకపోతే జగనైనా, మోడీ అయినా పీఠాలు కూలిపోవాల్సిందే.