వైఎస్ కంటే... జగన్ ఎక్కువ ’రెడ్డిష్‘

August 06, 2020

ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఒక ప్రకటన దినపత్రికల్లో భారీ ఎత్తున వచ్చింది. ఏపీలోనే కాదు తెలంగాణలోని పత్రికల్లోనూ మొదటి పేజీల్లో భారీగా ఈ ప్రకటనను ఇచ్చారు. ప్రకటన చివర్లో వైఎస్ కు మించిన జగనన్న దూసుకెళుతున్న రీతిలో వ్యాఖ్యానం చూసినంతనే అవాక్కు అయ్యేలా చేసింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం ఆర్నెల్లు లేదంటే మరో నెల ఎక్కువ అనుకుంటే.. అంత తక్కువ వ్యవధిలోనే వైఎస్ ను మించిపోయేలా జగన్ పాలనా తీరు ఉందని చెప్పటం ఎందుకంతగా ప్రయత్నిస్తున్నారన్నది ఒక ప్రశ్నలా మారింది.
వైఎస్ రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన జగన్.. ఇప్పుడు ఆయనకు మించిపోయే రీతిలో వ్యవహరిస్తున్నారన్న ఇమేజ్ కోసం యువనేత ఎందుకంతగా తపిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరైనా కావొచ్చు.. తన తండ్రికి మించిన ఇమేజ్ తో దూసుకెళుతున్నట్లుగా గొప్పలు చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ.. జగన్ హయాంలో మాత్రం అందుకు మినహాయింపుగా చెప్పాలి.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా లేని సిత్రమైన పరిణామాలు సీఎం జగన్ హయాంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చు.. వారి సామాజిక వర్గానికి చెందిన వారికి కాస్తంత ప్రాధాన్యత లభించటం.. ఆయన సన్నిహితులకు పదవుల్లో పెద్ద పీట వేయటం మామూలే. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. కానీ.. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంతగా.. ఆ మాటకు వస్తే వైఎస్ హయాంలోనూ కనిపించని అతి జగన్ పాలనలో కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.  
పదవుల విషయంలో ఏ మాత్రం అవకాశం ఉన్నా తన సామాజిక వర్గానికి జగన్ వేస్తున్న పెద్దపీట చూసి అవాక్కు అవుతున్నారు. విమర్శలు వస్తాయని అస్సలు ఫీల్ కాకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే షాక్ తింటున్నారు. అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్టన్లుగా మాటల్లో చెప్పే జగన్.. చేతల్లో మాత్రం అందుకుభిన్నంగా ఒక సామాజిక వర్గానికి వేస్తున్న పెద్దపీటకు సంబంధించిన జాబితా ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా ఈ జాబితాను అచ్చేయటం చూసినప్పుడు.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇట్టే తెలియక మానదు.
రెడ్డి సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వంలో వేస్తున్న పెద్దపీట.. ఆ వర్గానికి చెందిన వారికి కట్టబెడుతున్న పదవులు పెద్ద ఎత్తున ఉంటున్నాయంటున్నారు. ఇలాంటివన్ని జగన్ మీద చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణించేవారికి.. వివిధ పదవుల్ని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టిన వైనాన్ని జాబితా రూపంలో చెబుతున్నారు. ఆ జాబితాను చూస్తే.. జగన్ పాలన ఎలా సాగుతుందో ఇట్టే చెప్పేయొచ్చు.
1. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి
2. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి
3. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
4. ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి
5. పార్టీ జాతీయ కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి
6. ఒలంపిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ వి.విజయసాయిరెడ్డి (రెండో పదవి)
7. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి (మూడో పదవి)
8. పార్లమెంటరీ మంత్రివర్గ ఉసంఘం సభ్యుడు విజయసాయిరెడ్డి (నాలుగో పదవి)
9. ఎయిమ్స్‌ మంగళగిరి సభ్యుడు విజయసాయిరెడ్డి (ఐదో పదవి)
10. పార్లమెంటరీ మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
11. లోక్‌సభలో పార్టీ నేత మిథున్‌రెడ్డి
12. లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పి.మిథున్‌రెడ్డి (రెండో పదవి)
13. హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ కమిటీ సభ్యుడు మిథున్‌రెడ్డి (మూడో పదవి)
14. సీఎంఓ ప్రధాన సలహాదారు అజేయ కల్లాం
15. సీఆర్‌డీఏ చైర్మన్‌ ఆళ్ల రామకృష్ణారెడ్డి
16. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
17. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులక్రమబదీకరణ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెండో పదవి)
అధ్యయన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌
18. విద్యుత్తు ఒప్పందాల సమీక్షా కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (మూడో పదవి)
19. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20. మంత్రివర్గ ఉపసంఘ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెండో పదవి)
21. విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
22. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్షా కమిటి బాలినేని శ్రీనివాసరెడ్డి (రెండో పదవి)
23. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
24. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంతరెడ్డి
25. ప్రభుత్వవిప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి
26. తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర రెడ్డి (రెండో పదవి)
27. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితతా
28. ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా రెడ్డి
29. అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి
30. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి
31. సీఎం ఓఎస్‌డీ కృష్ణ మోహన రెడ్డి
32. సీఎం వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వరరెడ్డి
33. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అధ్యయన చైర్మన్‌ సి.ఆంజనేయరెడ్డి
34. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి
35. రాయలసీమ వర్సిటీ చైర్మన్‌ సీవీ రామచంద్రారెడ్డి
36. ఎస్కేయూ రిజిస్ట్రార్‌ మల్లికార్జున రెడ్డి
37. ఎస్వీయూ రిజిస్ర్టార్‌ శ్రీధర్‌ రెడ్డి
38. యోగి వేమన వీసీ ఏ.రామచంద్రారెడ్డి
39. ఆర్‌జీయుకేటీ చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి
40. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన రెడ్డి
41. సుప్రీం కోర్టులో అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ జి.నాగేశ్వరరెడ్డి
42. సమాచార శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ రెడ్డి
43. ఏవియేషన్‌ అడ్వయిజర్‌ వీఎన్‌ భరత్‌రెడ్డి
44. హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌
45. హెల్‌ కేర్‌ రిఫార్మ్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ బి.సాంబశివరెడ్డి
46. హెల్‌ కేర్‌ రిఫార్మ్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ కె.సతీశ్‌ రెడ్డి
47. ఐటీ సలహాదారు జె.విద్యాసాగర్‌రెడ్డి
48. ఐటీ సలహాదారు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి
49. ఐటీ సలహాదారు కె.రాజశేఖర రెడ్డి
50. వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి
51. వ్యవసాయ మిషన్‌ సభ్యుడు పి.రాఘవరెడ్డి
52. వ్యవసాయ మిషన్‌ సభ్యుడు చంద్రశేఖర రెడ్డి
53. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కమిటీ సభ్యుడు కె.అజేయరెడ్డి
54. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కమిటీ సభ్యుడు గోపాలరెడ్డి
55. టీటీడీ జేఈవో ధర్మారెడ్డి
56. రాష్ట్ర ఆహార తయారీ సొసైటీ సీఈవో ఎల్‌.శ్రీధర్‌ రెడ్డి
57. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూధన రెడ్డి
58. ఏపీఎన్ఆర్‌టీ చైర్మన్‌ మేడపాటి వెంకటరెడ్డి
59. ఈ ప్రగతి డైరెక్టర్‌ హర్షవర్ధనరెడ్డి అన్నపూర్ణరెడ్డి
60. డిజిటల్‌ డైరెక్టర్‌ జి.దేవందర్‌ రెడ్డి
61. ఐటీ డైరెక్టర్‌ శంకరరెడ్డి
62. పీకేఎం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి
63. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీజీవీఎఫ్‌ ప్రసాద్‌రెడ్డి
64. ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ టీ.బి.రెడ్డి
65. ఆంధ్ర వర్సిటీ సీటీసీ డీన్‌ పాండురంగారెడ్డి
66. నుడా చైర్మన్‌ కె.శ్రీధర్‌రెడ్డి
67. సీడాప్‌ చైర్మన్‌ ఎం.మహేశ్వరరెడ్డి
68. నుడా వైస్‌ చైర్మన్‌ టి.బాపిరెడ్డి
69. ఏపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చైర్మన్‌ భీమిరెడ్డి ప్రతాప్‌
70. కేడీసీసీ చైర్మన్‌ బి.సిద్ధార్థ్‌ రెడ్డి
71. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బి.సాంబశివారెడ్డి
72. ఏపీఎంఐఎస్ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర రెడ్డి
73. టీటీడీ సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి
74. టీటీడీ సభ్యుడు పుట్టా ప్రతాపరెడ్డి
75. టీటీడీ సభ్యుడు వేంరెడ్డి ప్రశాంతిరెడ్డి
76. టీటీటీ ప్రత్యేక ఆహ్వానితుడు ఏజె శంకర్‌రెడ్డి
77. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు కృపేందర్‌రెడ్డి
78. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి
79. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు సింగిరెడ్డి భాస్కర రెడ్డి
80. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు గౌరురెడ్డి శ్రీధర్‌రెడ్డి
81. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు కొమ్మెర వెంకట రెడ్డి
82. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు కోమటిరెడ్డి లక్ష్మీ రెడ్డి
83. హైదరాబాద్‌ స్థానిక టీటీడీ సభ్యుడు శ్రీవర రెడ్డి
84. ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ చైర్మన్‌ చిర్ల జగ్గిరెడ్డి
85. వ్యవసాయ కమిషన్‌ శాశ్వత సభ్యుడు ఎం చంద్రశేఖర రెడ్డి
86. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి
87. డీజీపీ పీఆర్ఓ తిరుమల రెడ్డి