జగన్ మీడియాను ఎవరైనా ఓదార్చండి - సాక్షి కాదు

May 26, 2020

తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ వెబ్ మీడియా... జగన్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చాలా పద్ధతిగా, చంద్రబాబును డ్యామేజ్ చేస్తూ వచ్చింది. 2019 ఎన్నికల వరకు నెటిజన్లలో జగన్ వర్గానికి చంద్రబాబును తిట్టడానికి అవసరమైన స్టఫ్ ను నిరంతరం అందించేది. కేవలం జన్మభూమి కమిటీలు, కొందరు ఎమ్మెల్యేల అరాచకాలను తెరపైకి తెచ్చి చంద్రబాబు చేసింది శూన్యం అని నిరూపించడానికి శతధా ప్రయత్నంచేసింది. ఇక సవాలక్ష కారణాలతో ఎట్టకేలకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ... తన లక్ష్యం నెరవేరిన సంతోషం ఆ వెబ్ మీడియాలో కనిపించడం లేదు.

ఎందుకంటే... తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడో అరకొరా కొన్ని తప్పులు కనిపిస్తే దానిని ఇంతలింతలు చేసి 70 ఎంఎం స్క్రీన్ పై ప్రచారం చేశారు. ఇపుడు జగన్ అధికారం చేపట్టాక నోరెళ్ల బెట్టి షాక్ తినడం ఆ వెబ్ మీడియా వంతయ్యింది. అదేంటి... చంద్రబాబును, ఎన్టీఆర్ ను... వీలైతే రామరాజ్యాన్ని మరిపించేలా పాలన అందిస్తాడనుకుంటే 50 రోజుల్లో ఆశలన్నీ అడియాశలు చేశాడేంటి అనుకుంటూ తీవ్రమైన మనోవేదనకు గురవుతోంది ఆ వెబ్ మీడియా యాజమాన్యం. జగన్ కు చెప్పలేక, చెప్పినా అక్కడ వినేవారు లేక ... జగన్ ని ఏమనుకుండా జగన్ తప్ప అందరూ దొంగలే అంటూ తన చేతులతో స్వయంగా రాసుకొస్తోంది.

చంద్రబాబు పై ఆ వెబ్ మీడియా వేసిన నిందలకు... జగన్ వంద రెట్లు తప్పులు చేస్తుంటే అయోమయంగా జగన్ ప్లీజ్ జగన్... మారు జగన్ అన్నట్లు వార్తలు రాసుకుంటూ బతికేస్తోంది. చంద్రబాబు గురించి 5 ఏళ్లలో వారు చెప్పిన యుటర్నులు జగన్ కేవలం 50 రోజుల్లో తీసుకున్నాడు. చంద్రబాబుపై వేసిన కరవు ముద్ర జగన్ పై 50 రోజుల్లో పడింది. బాబు వచ్చాడు జాబు పోయిందని వంద మంది గురించి వారు గతంలో రాస్తే వలంటీర్ల వ్యవస్థ వచ్చి లక్షల మంది జాబ్ పోయిన విషయం ఇపుడు వారే రాస్తున్నారు. రాజకీయ ప్రమేయమున్న అన్ని నియామకాలు వైకాపాకే ఇస్తున్నారని జనం తిట్టుకుంటున్నారని వారే రాస్తున్నారు. గత పది పదిహేను రోజులుగా ఆ వెబ్ మీడియా పడుతున్న పాట్లు చూస్తుంటే... అయ్యబాబోయ్ జగన్ మనందరి కొంప ముంచేలా ఉన్నాడే అంటూ ఆవేదన చెందుతోంది.

మొత్తానికి చుక్కల్లో చంద్రుడు మా వాడు అని వారు ఊహించుకున్నదానికి

కాదు కాదు నేను రాలిపోయే తోక చుక్కనే అంటూ జగన్ పాలన సాగిస్తున్న తీరు ఆ వెబ్ మీడియాకు కన్నీరు తెప్పిస్తోంది. పాపం !