జ‌గ‌న్ రికార్డు - ట్విట్ట‌రులో ట్రెండ్ అయ్యింది

September 18, 2019

వైఎస్ జ‌గ‌న్ అఫిడ‌విట్ దాఖ‌లులో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న క్రిమిన‌ల్ అఫిడ‌విట్ ఫైల్ సైజ్ 12 ఎంబీ ఉంద‌ట‌. ఉత్త టెక్స్‌టే. ఇది ఆల్‌టైం రికార్డ్ అట‌. #జ‌గ‌న్‌క్రిమిన‌ల్అఫిడ‌విట్ హ్యాష్ టాగ్ ఈరోజు ట్రెండ్ అయ్యింది. గంట‌లో 5 వేలు ట్వీట్లు ప‌డ్డాయి. దిసీజ్ నాట్ జ‌స్ట్ హిస్ రికార్డ్‌... దిసీజ్ ఆల్ టైం రికార్డ్ అంటూ ట్రోల్ అయ్యింది. 31 కేసుల‌కు సంబంధించిన వివ‌రాల‌తో 51 పేప‌ర్ల‌తో కూడిన నామినేష‌న్ దాఖ‌లు చేశారు వైఎస్ జ‌గ‌న్‌. ఇన్ని కేసులున్న ఏకైక సీఎం అభ్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌.

ఈరోజు ట్విట్ట‌రులో జ‌గ‌న్‌పై పేలిన పంచ్‌లు మామూలుగా లేవు. నీ మీద ఉన్న కేసుల‌తో లా విద్యార్థి పీహెచ్‌డీ పూర్తి చేయొచ్చు అని ఒక‌రంటే.. ఒక స‌ప్లిమెంట్ ప‌డితేనే కాలేజీకి వెళ్లాలంటే సిగ్గేస్తుంది. 31 కేసులు పెట్టుకుని ఎంత ద‌ర్జాగా ఉన్నావ‌న్నా? అని ఒకమ్మాయి సెటైర్‌. ఇంకొక‌రు అయితే ఏకంగా.... *ఐపీసీ సెక్ష‌న్స్‌పై జ‌గ‌న్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్* అని వ‌ర్ణించారు. మొత్తానికి ఈరోజు జ‌గ‌న్ అఫిడ‌విట్ ట్విట్ట‌రులో పెద్ద ట్రెండింగ్ హ్యాష్‌టాగ్‌.