తీవ్ర‌మైన డిప్రెష‌న్ లో జ‌గ‌న్‌?

July 05, 2020

ఆత్మ‌న్యూన‌త భావంలో కొట్టిమిట్టాడే వారు.. న‌లుగురిలో క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌రు. చుట్టూ స‌మూహం ఉన్నా.. అందులో ఒంట‌రి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.ఇక‌.. డిప్రెష‌న్ లో ఉన్న వారు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌రు. త‌మ ఉనికి ఎవ‌రికి క‌నిపించ‌న‌ట్లుగా ఉండాలి భావిస్తుంటారు. త‌క్కువ‌గా మాట్లాడ‌తారు. ముఖంలో విచారం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి పెద్ద ఇష్ట‌ప‌డ‌రు. ఇలా చెప్పుకుంటూ డిప్రెష‌న్ లో ఉన్న ల‌క్ష‌ణాల లిస్టు జ‌గ‌న్ తీరుకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం క‌నిపిస్తుంది.
పోలింగ్ ముగియ‌టానికి రెండు రోజుల ముందు కూడా గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించిన జ‌గ‌న్‌.. పోలింగ్ రోజు నుంచి ఆయ‌న బిహేవియ‌ర్ పూర్తిగా మారిపోవ‌టం క‌నిపిస్తుంది. పోలింగ్ ముగియ‌టానికి ముందే హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ కు వ‌చ్చేసిన ఆయ‌న తీరు అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. గెలుపు ధీమాతోనే జ‌గ‌న్ వెళ్లిపోయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా జ‌గ‌న్ బ్యాచ్ ప్ర‌చారం చేసింది.
పోలింగ్ ముగిసిన నాటి నుంచి జ‌గ‌న్ తీరులో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది. ఎవ‌రిని క‌ల‌వ‌కుండా ఉండ‌ట‌మే కాదు.. క‌లిసేందుకు పెద్ద‌గా ఇష్ట‌డ‌ప‌ని తీరు క‌నిపించింది. పార్టీ ముఖ్య‌ల్లో ఒక‌రిద్ద‌రు త‌ప్పించి.. మిగిలిన వారంతా సారు రెస్ట్ లో ఉన్నార‌ట‌.. క‌ల‌వ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్న మాట‌ను చెప్పుకోవ‌టం క‌నిపించింది.
పార్టీలో మిగిలిన వారి తీరుకు భిన్నంగా జ‌గ‌న్ తీరు ఉంద‌ని చెప్పాలి. గెలుపు త‌మ‌దేన‌న్న‌హ‌డావుడి జ‌గ‌న్ పార్టీ నేత‌లు చేస్తుంటే.. అందుకు భిన్నంగా జ‌గ‌న్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఆయ‌న నిశ్శ‌బ్దానికి విజ‌యం మీద ధీమా అని చెప్పినా.. అది నిజం కాద‌న్న మాట‌ను జ‌గ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు.సుదీర్ఘ‌కాలం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి.. పాద‌యాత్ర చేసినా.. తానెన్ని మాట‌లు చెప్పినా న‌మ్మ‌ని ప్ర‌జ‌ల తీరుతో ఆయ‌న హ‌ర్ట్ అయ్యార‌ని.. ఆ ఆవేద‌న‌తోనే ఎవ‌రిని క‌ల‌వ‌ట్లేద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. వీరి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ బిహేవియ‌ర్ ఉండ‌టం గ‌మ‌నార్హం. కొంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు జ‌గ‌న్ డిప్రెష‌న్ లో ఉన్నారా?