నీ నిర్ణయంతో రెండు ప్రాణాలు తీశావుగా జగన్

June 04, 2020

మద్యం షాపులు తెరవకపోతే కొంప మునిగిపోయేదేం లేదు. ఎక్కడో అరుదుగా కొందరికి మాత్రమే మానసిక సమస్యలు వస్తున్నాయి. అవి కూడా పదుల సంఖ్యలో మాత్రమే. కానీ రాష్ట్ర ఆదాయం కోసం హానికరమైన, ప్రమాదకరమైన అవకాశాన్ని ఎంచుకున్న రాష్ట్రాల్లో జగన్ ఒకరు. లాక్ డౌన్ సమయంలో కూడా మద్యం షాపులు ఓపెన్ చేయడంతో 40 రోజుల లాక్ డౌన్ వృథా అయిపోయింది. స్వయంగా ప్రభుత్వమే కరోనాను ఆహ్వానించినట్టు అయ్యింది. జగన్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మద్యం తాగడం వల్ల జనం నాశనమవుతారు, అందుకే మద్యపాన నిషేధం అన్నారు.

జగన్ తన అభిప్రాయాలను ప్రజలకు అనుకూలంగా కాకుండా తనకు అనుకూలంగా మలచుకుంటారు అనడానికి ఈరోజు మద్యం విధానమే కారణం. ఒక్కసారిగా ఎక్కడా లేని విధంగా 25 శాతం మద్యం ధరలు పెంచారు. మందు బానిసలు రేట్లను ఎపుడూ పట్టించుకోరు. అప్పు చేసి అయినా తాగుతారు. తాగకుండా మాత్రం ఉండరు. దీంతో ధరలు పెంచడం వల్ల మందు అలవాటున్న పేదల ఖర్చు మరింత పెరుగుతుందే గాని జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరదు. జగన్ రెడ్డి చెబుతున్న బండసూత్రం ఏంటో తెలుసా... ధరలు పెంచితే కొనలేక మందు మానేస్తారట. అవేమైనా కూరగాయలా, మాంసమా? ధర ఎక్కువ అని మానేయడానికి... అది వ్యసనం. అది మనిషిని ఎందాకైనా తీసుకెళ్తోంది. ధర కారణంగా మందు మానేయడం అనేది జరగదు.

తాజాగా ఈరోజు మందు అమ్మకాలు మొదలుపెట్టడం వల్ల రెండు అన్నెంపున్నెం ఎరుగని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో మద్యం తాగొద్దని వారించినందుకు పెళ్లాన్ని విపరీతంగా భర్త కొట్టాడు. ఎందుకో తెలుసా... తాగుడుకు బానిసైతే కుటుంబం నాశనం అవుతుందని చెప్పినందుకు కొట్టాడని స్థానికులు, ఇరుగుపొరుగు చెప్పారు. భర్త కొట్టడంతో మనస్తాపానికి గురైన తల్లీబిడ్డలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి మందు అమ్మకాలు తెరవకపోతే ఈ రెండు ప్రాణాలు కచ్చితంగా మిగిలేవి. ముఖ్యమంత్రి గారు ఇదా మీ ప్రజల పట్ల మీ బాధ్యత?