సంచలనం - సాయిరెడ్డి పోస్టు పీకేసిన జగన్

November 19, 2019

ఇది జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం. వైకాపా పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి జగన్ తర్వాత విజయసాయిరెడ్డే. అసలు 2019 ఎన్నికల్లో అయితే విజయసాయిరెడ్డి లేకుండా ఏ పనీ జరగలేదు. అసలు క్యాడర్ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఎంతో కీలకంగా కనిపించిన ఆయనకు ప్రచారం జరిగినట్టే ప్రాధాన్యత దక్కింది. మొన్నటి విజయం అనంతరం ఏకంగా 5 పదవులు జగన్ ఆయనకు కట్టబెట్టారు. అందులో అత్యంత కీలకమైన, కేబినెట్ ర్యాంకు కలిగిన పోస్టు ’ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి‘. 

మొన్ననే ఇచ్చిన ఈ పోస్టును రద్దు చేస్తూ జగన్ ఉత్తర్వులు ఇచ్చారు. కారణాలు ఇంకా బయటకు రాలేదు. మొన్న ఇచ్చిన అంత కీలకమైన పోస్టును పీకేయడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి ఇది నెగెటివ్ సైన్. ఇటీవల మోడీకి బీజేపీ నేతల కంటే సాయిరెడ్డి ఎక్కువ దగ్గరయ్యాడు. ఆంధ్రా పళని స్వామి అంటూ సాయిరెడ్డిపై ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక పోస్టు నుంచి సాయిరెడ్డిని పీకేయడం పార్టీలో కలకలం రేపింది. ఏదో పాత పదవి నుంచి తొలగించి ఉంటే... కొత్త వి ఇచ్చారు కాబట్టి తొలగించారు అనుకోవచ్చు. కానీ మొన్నే ఇచ్చిన పదవి, పైగా ఆయనకు ఇచ్చిన పదవుల్లో కీలకమైన పదవిని తీసేయడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియక అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి పార్టీలో ఏదో జరుగుతోంది.