టీడీపీ పథకమా?... లేపెయ్ !! - జగన్

May 26, 2020

ఏపీలో జగన్ పట్ల మెల్లగా వ్యతిరేకత పెరుగుతోందా? వర్గాల వారిగా, వయసుల వారిగా జగన్ కు జనం శత్రువులు అవుతున్నారా? ఇంకా ఎక్కువ రోజులు కాకపోవడం వల్ల బయటకు చెప్పలేకపోతున్నారు గాని జగన్ మీద ప్రజల్లో కోపం కాస్త గట్టిగానే ఉందట. వాస్తవానికి జగన్ ఇద్దామనుకున్న సీట్లు కంటే అనూహ్యంగా ఎక్కువే ఇచ్చారు. ఇన్నిచ్చి తప్పు చేశామా అని జనాల్లో అంతర్మథనం కూడా మొదలైంది. ముఖ్యంగా ప్రజా పథకాల విషయం అతని తీరు ఆయా వర్గాల్లో అసంతృప్తికి కారణం అవుతోంది.
చంద్రబాబు పేరు మీద ఉన్నవి, చంద్రబాబుకు గుర్తింపు తెచ్చినవి ఏవైనా పథకాలు ఉంటే... వాటిని తీసేయడానికి జగన్ మొగ్గు చూపుతున్నాడు. చంద్రబాబు ముద్ర ఎక్కడా కనిపించకూడదు అని జగన్ భావిస్తున్నారు. అయితే... చంద్రబాబు ఓడిద్దాం అని జగన్ కి ఓటేస్తే మా నోటి వద్ద కూడు లాక్కుంటున్నాడని జనం బాధపడుతున్నారు.
పైకి సాధారణంగా కనిపిస్తున్నా ప్రతి పథకం జనాలకు ప్రధాన అవసరంగా తీర్చిదిద్దారు చంద్రబాబు. ఉదాహరణకు గతంలో ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యేది. అనాథగా మారి నిరుపేదలుగా మిగిలే వారు. పిల్లల చదువులు ఆగిపోయేవి. అప్పులు కట్టలేక పరువు పోయేది. అయితే... చంద్రన్న భీమా పథకం వల్ల ఏపీలో అలాంటి సీనే కనిపించకుండా పోయింది. ఏ ఇంటిపెద్ద మరణించినా స్వల్పకాలంలో ఆ ఇంటికి చంద్రన్న భీమా కింద 5 లక్షలు ఇచ్చేవారు. దీంతో పిల్లల చదువులకు, కుటుంబ జీవనానికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది దీని నుంచి లబ్ధి పొందేవారు. కానీ జగన్ వచ్చాక ఆ పథకాన్ని ఎత్తేశారు. దానికి డబ్బులు కట్టలేదు. దీంతో మళ్లీ ప్రమాద బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రారంభించిన పసుపు కుంకుమ పథకం పోయింది. నిరుద్యోగులకు భృతి పోయింది. పండగలకు ముస్లింలకు ఇచ్చే తోఫా పోయింది. ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టేవారు. అది కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఎంతో మంది ఆకలి తీర్చేవి. వాటిని పేరు మార్చి కూడా కొనసాగించడానికి ఇష్టపడలేదు జగన్. కొన్ని చోట్ల పేరు మార్చినా సరిగా భోజనం పెట్టడం లేదు. అయితా సోమవారం నుంచి అమరావతిలోని అన్నక్యాంటీన్ పూర్తిగా ఎత్తేశారు.

ఇలా ఒకటేమిటి ఎన్నో పథకాలను జగన్ లేపేస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా చూస్తున్నారు. రాజన్న రాజ్యం ఇలా ఉంటుందని ముందే చెప్పి ఉండాల్సింది కదా అని జగన్ పై సెటైర్లు వేస్తున్నారు జనం.