ఏపీ: ప్రజల డబ్బును సేవ్ చేసిన ప్రతిపక్షాలు !

May 25, 2020

దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయిన రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వ్యవహారం ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ... కలుగులో దాగిన స్కాం గుట్టును సోషల్ మీడియాలో చీల్చి చెండాడి బయటకు తెచ్చారు. దీనికి సమాధానం చెప్పమంటే ఏపీ సర్కారు బెదిరింపులకు దిగింది. విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. అయితే... ఒక్కసారి సోషల్ మీడియాలో ఏదైనా వెళ్తే దానిని నిలువరించడం చాలా కష్టం. ఈ విషయం అందరికంటే వైసీపీకి బాగా తెలుసు. అందుకే సర్కారు దిగిరాక తప్పలేదు.

టెస్టింగ్ కిట్లు చత్తీస్ ఘడ్ 337 రూపాయలకే కొంటే... ఏపీ దానికి రెట్టింపు చెల్లిస్తున్న విషయం తెలిసింది. దక్షిణి కొరియాకు, ఏపీ సర్కారుకు మధ్యవర్తిత్వం చేసిన కంపెనీ కూడా ఓ రెడ్డిదే. దీంతో అదింకా వివాదాస్పదంగా మారింది. ఇంత ధర ఎలా చెల్లిస్తారు అని ప్రజలందరూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిలదీశాయి. దీనిని వైసీపీ సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో గొడవ ముదిరింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ దీనిపై స్పందించారు.

దక్షిణ కొరియాలో ఆ రేటుకు దిగుమతి చేసుకున్న మాట వాస్తవమే గాని... ఏ రాష్ట్రానికి అయినా మాకంటే తక్కువ అమ్మితే మేము కూడా అదే రేటు చెల్లిస్తామని నిబంధన  ముందే పెట్టాం అని జగన్ చెప్పారు. అందువల్ల చత్తీస్ ఘడ్ రేటే తాము కూడా చెల్లిస్తామని... ఇంకా ఆ కంపెనీకి 25 శాతం సొమ్మే ఇచ్చామని... కాబట్టి చత్తీస్ ఘడ్ ధరతో అవి మనకు వస్తాయని సీఎం జగన్ అన్నారు.

అంతా బాగానే ఉంది గాని... ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రచ్చ చేయకపోతే మధ్యలో ఉన్న రెడ్డిగారి కంపెనీ.. బాగా లాభపడేది. మొత్తానికి తమ డబ్బును ప్రజలు తామే కాపాడుకున్నారు. ఇదో చరిత్ర.