ఈ టైంలో ఆ పనిచేశావంటే... నీది ఓ రేంజ్ పగ జగన్!

August 04, 2020

అంతే... ప్ర‌చారం జ‌రుగుతున్నా... రాజ‌కీయ వ‌ర్గాలు, విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నా....జ‌గ‌న్ విధానంఅంతే. త‌ను అనుకున్న‌ది చేసేస్తారు. ముఖ్యంగా మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ముద్ర‌ను చెరిపేయ‌డంలో ఆయ‌న బిజీగా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా `అమ‌రావ‌తి` అనే పేరును రూపు మాప‌డంలో వైసీపీ అధ్యక్షుడి ప్ర‌ణాళిక‌ల‌న్నీ సాగుతున్నాయి. కొద్ది కాలం క్రిత‌మే రాజాధానిగా అమరావతిని మార్చివేయ‌డం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సీటు వెనుక బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించే పూర్ణ వికసిత పద్మం తొల‌గించడం వంటి ప‌లు నిర్ణ‌యాలు తీసు‌కున్న జగన్ సర్కారు తాజాగా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ప్రభుత్వం మార్పు చేసింది.
అమరావతికి ఉన్న చారిత్రక ప్రాధాన్యంతో పాటు బౌద్ధుల చరిత్రను గుర్తు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న వేళ పూర్ణ వికసిత పద్మాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఈ డిజైన్ ఆయనకూ నచ్చిందన్న వార్తలు వచ్చాయి. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సమావేశ మందిరంలోనూ ఇదే చిహ్నాన్ని పెట్టించుకున్నారు. అయితే, హ‌ఠాత్తుగా ఇటీవ‌ల ఈ చిహ్నాన్ని తొల‌గించారు. దీనికి అధికారిక స‌మాచారం ఇవ్వ‌లేదు.
కాగా తాజాగా మెట్రో రైల్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు జీవోలో ఏపీ స‌ర్కారు వెల్లడించింది. గతంలో నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసినట్లు జీవోలో ఏపీ సర్కారు ఉదహరించింది. లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ గా మార్చినట్లు సర్కార్ స్ఫష్టం చేసింది. ప్రస్తుతం విశాఖలో తలపెట్టిన మెట్రో ప్రాజెక్ట్ కు కూడా అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గా ఉండటంతో పేరు మార్పు చేసినట్లు జీవో లో ప్రభుత్వం వెల్లడించింది. కాగా, క‌రోనాతో ప్ర‌పంచం అంతా అత‌లాకుత‌లం అయితున్న త‌రుణంలో....ఏపీలో కేసులు ఆందోళన క‌లిగించే రీతిలో కేసులు పెరుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం స‌హ‌జంగానే చ‌ర్చనీయాంశంగా మారింది.