కోర్టు తిట్లతో జగన్ లో ఫ్రస్ట్రేషన్... బాబుపై కొత్త రివెంజ్ నిర్ణయం 

July 01, 2020

దేశంలో, ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం కరోనా గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించడం లేదు. ప్రతిదీ కరోనా సంబంధం ఉంటేనే నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఒక్క జగన్ మాత్రమే ఇంత సీరియస్ పరిస్థితుల్లో కూడా కరోనాను పక్కన పెట్టి చంద్రబాబును ఎలా దెబ్బకొట్టాలి అన్న ఆలోచనలతోనే గడపుతున్నారు. అలాంటి నిర్ణయాలకే సమయం కేటాయిస్తున్నారు. నిద్రలేచినా, నిద్రపోయినా చంద్రబాబు తప్ప గురించి తప్ప దేనిగురించి కూడా జగన్ దృష్టిపెట్టడం లేదు.

చంద్రబాబు రూపొందించిన అమరావతి ప్రణాళికపై ఒక్క రూపాయి కూడా పెట్టకూడదనే కఠిన నిర్ణయంతో ఉన్నారు జగన్. అందుకే మూడు రాజధానుల ఆలోచన చేసి ఖర్చంతా అటే మళ్లిస్తున్నారు. దీనిని శాసన రాజధాని గా ఉంచాలని ఆలోచించినా.. దాని మీద రూపాయి కూడా ఖర్చుపెట్టే ఉద్దేశంతో లేరు. అమరావతిపై రూపాయి పెట్టినా అది బాబు క్రెడిట్ కే వెళ్తుందనేది జగన్ ఆలోచన. అందుకే దాని గురించి క్షణం కూడా ఆలోచించడం లేదు. మూడు నెలలుగా అమరావతి రైతులు నిరంతరంగా ధర్నాలు, దీక్షలు చేస్తున్నా వారిని కనీసం పట్టించుకోవడం లేదు జగన్. వారి కోరికలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. 30 వేల మంది ఆస్తులకు సంబంధించిన అంశం అది. అయినా.. దానిని ఇగ్నోర్ చేస్తున్నారు. 

ఇలాంటి సమయంలో వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని మార్చాలని చంద్రబాబు గీసిన మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా అక్కడ ఒక సెంటు స్థలం చొప్పున రెండు  జిల్లాల రైతులకు పంచాలని జగన్ ప్రయత్నం చేశారు. దీంతో ఆ భూములు ఇచ్చిన రైతులు ఆ ప్రాంతంలోని భూమిని జగన్ పేదలకు పట్టాల కింద పంచడంపై కోర్టుకు వెళ్లారు. కోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ భూమిని ఇతర ప్రాంతాల వారికి పంచడానికి వీల్లేదని ఆర్డరిచ్చింది. దీంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు జగన్.

అందుకే చంద్రబాబు మీద కోపంతో సాయంత్రం లోపు కొత్త ఆదేశాలు వచ్చాయి. అమరావతి భూ కేటాయింపుల వ్యవహారంపై సీబీఐ విచారణకు అప్పగించారు. అమరావతి భూముల వ్యవహారంపై గతంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఇన్ సైడర్ ట్రేడింగ్ నిజమేని పేర్కొంది. వాస్తవానికి ఆ కమిటీ రిపోర్ట్ అదే ఇస్తుందని ముందుగా ఊహించినదే. అందుకే ఆ నివేదిక చంద్రబాబు క్రెడిబులిటీని ఏమీ దెబ్బతీయలేకపోయింది. దీంతో తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 

కొసమెరుపు ఏంటంటే... ఏ విచారణకు అయినా సిద్ధం అని చాలా కాలం నుంచి చంద్రబాబు, లోకేష్ చెబుతూనే ఉన్నారు. అలాంటి జగన్ నిర్ణయం వారికి పెద్ద షాక్ ఏమీ కాదు... పొరపాటున జగన్ కి రివర్స్ షాక్ తగిలే ప్రమాదమూ లేకపోలేదు. అందులో అవినీతి జరగలేదు అని సీబీఐ నిరూపిస్తే... జగన్ అడ్డంగా బుక్ అవుతారు. 

Read Also

ఈ వార్త వింటే జనం చస్తారు మోడీ గారు
లండన్ లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియా కి రప్పించాలి
Dr లీ ముందుచూపు: మనకిప్పుడు అవసరం