ఆ లెక్క జగన్ దగ్గర లేదు - చంద్రబాబు 

August 05, 2020

మనం మునుపెన్నడూ చూడని కష్టకాలంలో ఉన్నాం. ప్రజలు కనీవినీ ఎరుగని కష్టం అనుభవిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రజలకు అన్నివిధాలా అండగా ఉండాల్సిన ప్రభుత్వం సొంత లాభంపై దృష్టి పెట్టిందంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

8 వేల కోట్లు కేంద్రం ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బును సరిగా వాడుకోలేదు.

ఆ డబ్బులు ఎలా ఖర్చుపెట్టారో జగన్ వద్ద లెక్క ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

కుటుంబానికి ఐదు వేలు ఇచ్చి ఆదుకోమని చెప్పాం. అయినా విస్మరించారు.

అనుభవ రాహిత్యంతో ఘోరమైన తప్పిదాలకు పాల్పడుతున్నారు.

కరోనాపై కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాని విమర్శించారు.

ఇక అవినీతికి అంతులేదని చంద్రబాబు లిస్టు చెప్పారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు. 

అంబులెన్సులు 108, 104 కొనుగోళ్లలో అక్రమాలు చేశారు. విజయసాయిరెడ్డికి ప్రభుత్వ సొమ్ముతో బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.

29 వేల మంది రైతులను వేధిస్తున్నారు. నయాపైసా తీసుకోకుండా త్యాగం చేయడం తప్పా? 200 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేదు.