జాతీయ మీడియాలో జగన్ గాలిపోయింది

May 26, 2020

జగన్ అబద్ధాలు చెబుతున్నారు... అని ఒక కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం అరుదు. బీజేపీ - వైసీపీ బాయి బాయీ కదా అనుకుంటున్నారేమో. ఎంత రాసుకుపూసుకు తిరిగినా ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పి డ్యామేజ్ చేస్తే ఊరుకుంటారా? ఇదీ అంతే.

అయినా... బీజేపేపీ జగన్ ని వదిలేసి ఆల్రెడీ రెండు నెల్లయ్యిందని పబ్లిక్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. వీరు వారిని పొగుడుతున్నారు... బీజేపీ మాత్రం వీరిని ఛీ పో అంటోంది. అసలు విషయంలోకి వస్తే...చంద్రబాబు హయాంలో కుదురుర్చుకున్న పీపీఏ ఒప్పందాలలో అవినీతి ఉందని తొలిరోజు నుంచి జగన్ ఆరోపిస్తున్నారు. పొరపాటు పడ్డాడేమో అని కేంద్రం రెండు మూసార్లు లేదని చెప్పింది. ఒకసారి ఏకంగా లేఖ రాసేసింది. ఎంతకీ జగన్ వినకపోవడంతో పాటు ఇటీవలి కేబినెట్లో మరోసారి అదే పాట పాడటంతో బీజేపీకి చిరాకొచ్చింది.

స్వయంగా ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్... జగన్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మీడియా సమక్షంలో చెప్పారు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేయాలని ఏపీ సర్కారు పదేపదే కోరుతోందని... ఆగ్రహించారు. కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్ కు అర్థం కావడం లేదా? వినిపించుకోవడం లేదా? అని అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి స్వయంగా పీపీఏల్లో తప్పులేదని చెప్పడంతో జాతీయ మీడియాలో ఏపీ సీఎం జగన్ పరువు పోయింది. ఇంధన వనరుల శాఖ చెబుతుంటే... మొండిపట్టు ఎందుకు  పడుతున్నాడా అని అందరూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సర్కారు వైఖరి... దేశ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శించారు ఆర్కేసింగ్.  ఈ సందర్భంగా ఈ విషయంపై సెలైంట్ గా నోరు మూసుకోవాలని అన్నట్లు కేంద్ర మంత్రి పరోక్ష హెచ్చరికలు చేశారు. త్వరలో ఈ విషయం సద్దుమణుగుతుంది అన్నారు. అంటే... కచ్చితంగా దానిని వదిలేయాలని అని జగన్ కు సూచనలా ఉన్నాయీ వ్యాఖ్యలు.

ఎంతటి వారైన ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు. జగన్ బీజేపీకి బానిసత్వం చేస్తే తనను ఏమీ చేయరు అనుకుని ఉండొచ్చేమో గాని... భారతదేశంలో ఇక భాగమైన ఏపీ చేసే తప్పులు కొన్ని ప్రధాని పరువును తీయగలవు. అందుకే చంద్రబాబుపై కక్ష తీర్చుకునే క్రమంలో బీజేపీకి జగన్ బద్ధ శత్రువు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 

Read Also

రకుల్... బ్యూటీ ఇన్ బ్లాక్ !!
‘సైరా’లో పది గూస్ బంప్స్ సీన్స్
హామీలిచ్చేటప్పుడు కండీషన్లు చెప్పరేం జగన్