జగన్ ఎంత ప్రయత్నించినా ఆ పని కావడం లేదు 

August 07, 2020

ప్రతి పేదవాడికి ఇంటి స్థలం అని జగన్ ఎన్ని సార్లు బాకా ఊదుకున్నా ఆ పని కావడం లేదు జనవరి నుంచి మూడు సార్లు వాయిదా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇపుడు నాలుగో సారి వాయిదా పడింది. ఈ వాయిదాకు కారణం కరోనా అని అధికారికంగా చెబుతున్నారు గాని... ఇళ్ల పట్టలాలు పంచే భూముల్లో అత్యధికం కోర్టుల్లో ఉండటమే వాయిదాకు అసలు కారణం అని తెలుస్తోంది. దీంతో జులై 8న పట్టాలు పంచే ఈ కార్యక్రమం స్వతంత్ర దినోత్సవానికి వాయిదా పడింది. అపుడు కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా రోజురోజుకు పెరుగుతోంది.

ఆ స్థలం ఎందుకు పనికి రాదు 

ఇక జగన్ పంచుతున్న ఇంటి స్థలాలపై జనాల్లో పెద్దగా సంతృప్తి కనిపించడం లేదు. ఎక్కడో మారుమూలన పనికి రాని స్థలాలు ఇవ్వడం ఒక కారణం అయితే... 48 గజాల స్థలంలో ఏం కట్టుకోలేమని... 120 చదరపు అడుగుల గది కూడా కట్టుకోలేమని... అలాంటి స్థలం తీసుకుని ఏం చేయాలని జనం నిరుత్సాహం వ్యక్తంచేస్తున్నారు. పోనీకోరుకున్న చోట ఇస్తే.. దానిపక్క ఇంకొంచెం కొనే అవకాశం ఉండేది. సరే ఇచ్చాక అయిన అమ్ముకునే అవకాశం ఉందా అంటే అదీ లేదు. దీంతో ఆ సెంటు స్థలం తీసుకుని ఏం చేసుకోవాలని జనం విమర్శలు చేస్తున్నారు. 

ప్రస్తుతానికి మాకు స్థలం రావాలి అని దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు గాని వస్తే ఆ స్థలం ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. మన ఊళ్లలో ఎంత ఇళ్లు లేని వారికి అయినా ఎక్కడో ఒక చోట రెండు మూడు సెంట్లలో గుడిసె ఉంటుంది. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే... కనీసం ఒకటిన్నర సెంటు స్థలం అయిన ప్రజలకు ఇచ్చేది. అది వారికి ఉపయోగకరంగా ఉండేది. కానీ ప్రభుత్వం ఒక సెంటు ఇవ్వడం అనేది తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందని అంటున్నారు.

పైగా ఇచ్చే ఆ సెంటు స్థలానికి స్థానిక నేతలు, వలంటీర్లు లంచాలు అడుగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఫోన్ రికార్డులు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి వైసీపీ నేతలకు సిరుల పంట పండించిందని... దాని కోసమే ఈ పథకం పెట్టారని  ప్రతిపక్ష నేతలు.. చివరకు జగన్ అభిమాని ఉండవల్లి కూడా విమర్శించారు. 

సరే ఇంత జరిగినా ఆ వచ్చే స్థలమైనా వెంటనే చేతికి అందుతుంది అనుకుంటే వివాద రహితంగా భూములుసేకరించాల్సిన ప్రభుత్వం అదే పనిగా ఈ కార్యక్రమాన్ని ఆలస్యం చేయడానికా అన్నట్లు వివాదాలతో కూడిన, కోర్టుల్లో ఉన్న భూముల్లో స్థల పంపిణీ చేయడానికి పూనుకోవడం వెనుక కారణం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.